టెస్ట్ ర్యాంకింగ్స్:​ టాప్‌లో స్మిత్.. రెండో స్థానానికి పడిపోయిన కోహ్లీ

టెస్ట్ ర్యాంకింగ్స్:​ టాప్‌లో స్మిత్.. రెండో స్థానానికి పడిపోయిన కోహ్లీ
Steve Smith pips Virat Kohli to reclaim No 1 spot in ICC Test rankings; Jasprit Bumrah rises to third position among bowlers

రన్ మెషీన్, భారత జట్టు కెప్టెన్ విరాట్​ కోహ్లీ టెస్టుల్లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఆసీస్​ సీనియర్​ ఆటగాడు స్టీవ్​ స్మిత్​ ఒక్క పాయింట్​ తేడాతో తొలి స్థానాన్ని రిప్లేస్ చేశాడు. 904 పాయింట్లతో స్మిత్​ మొదటి స్థానంలో ఉండగా.. 903 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు కింగ్​ కోహ్లీ. 2015 డిసెంబర్​ నుంచి తొలి స్థానంలో ఉన్నాడు స్మిత్​. అయితే 2018 ఆగస్టులో ఈ ఆటగాడు బాల్​ ట్యాంపరింగ్​ కారణంగా ఏడాది నిషేధం ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో […]

Ram Naramaneni

|

Sep 03, 2019 | 9:11 PM

రన్ మెషీన్, భారత జట్టు కెప్టెన్ విరాట్​ కోహ్లీ టెస్టుల్లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఆసీస్​ సీనియర్​ ఆటగాడు స్టీవ్​ స్మిత్​ ఒక్క పాయింట్​ తేడాతో తొలి స్థానాన్ని రిప్లేస్ చేశాడు. 904 పాయింట్లతో స్మిత్​ మొదటి స్థానంలో ఉండగా.. 903 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు కింగ్​ కోహ్లీ. 2015 డిసెంబర్​ నుంచి తొలి స్థానంలో ఉన్నాడు స్మిత్​. అయితే 2018 ఆగస్టులో ఈ ఆటగాడు బాల్​ ట్యాంపరింగ్​ కారణంగా ఏడాది నిషేధం ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో కోహ్లీ కెరీర్​లో బెస్ట్ ప్రదర్శనతో ర్యాంకింగ్స్​తో తొలి స్థానం కైవసం చేసుకున్నాడు.

ఏడాది నిషేధం తర్వాత క్రికెట్​లోకి అడుగుపెట్టిన స్మిత్​.. తొలి టెస్టులో రెండు శతకాలు సాధించాడు. రెండో టెస్టులో 92 పరుగులు చేశాడు. 63.2 శాతం సగటుతో సుదీర్ఘ క్రికెట్​లో అదరగొడుతున్నాడు. ఇక టీమిండియా వైస్​ కెప్టెన్​ అజింక్యా రహానే టాప్​-10లో చోటు దక్కించుకున్నాడు. నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 7వ స్థానంలో నిలిచాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu