ఈ బుడ్డోడు మాములోడు కాడు..విరాట్ కోహ్లీకే ఆటోగ్రాఫ్​ ఇచ్చాడు!

ఈ బుడ్డోడు మాములోడు కాడు..విరాట్ కోహ్లీకే ఆటోగ్రాఫ్​ ఇచ్చాడు!
7-Year-Old Indian Fan 'Turns The Table' On Virat Kohli & His Wife Anushka Sharma In Jamaica

రన్ మెషీన్​, భారత జట్టు కెప్టెన్ విరాట్​ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అతడిని చూసేందుకు, ఫొటోలు దిగేందుకు యువత గంటల తరబడి ఎదురుచూస్తారు. ఈ స్టార్​ క్రికెటర్​ భార్య అనుష్క శర్మ బాలీవుడ్​లో ప్రముఖ నటి. అలాంటి ఈ ఇద్దరు స్టార్​లు కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు.? ఓ ఆటోగ్రాఫ్​, ఓ సెల్ఫీ అడుగుతారు. కాని ఓ ఏడేళ్ల బుడతడు మాత్రం వారికే ఆటోగ్రాఫ్​ ఇచ్చాడు. ఇటీవల వెస్టిండీస్​ టూర్​లో […]

Ram Naramaneni

|

Sep 03, 2019 | 7:33 PM

రన్ మెషీన్​, భారత జట్టు కెప్టెన్ విరాట్​ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అతడిని చూసేందుకు, ఫొటోలు దిగేందుకు యువత గంటల తరబడి ఎదురుచూస్తారు. ఈ స్టార్​ క్రికెటర్​ భార్య అనుష్క శర్మ బాలీవుడ్​లో ప్రముఖ నటి. అలాంటి ఈ ఇద్దరు స్టార్​లు కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు.? ఓ ఆటోగ్రాఫ్​, ఓ సెల్ఫీ అడుగుతారు. కాని ఓ ఏడేళ్ల బుడతడు మాత్రం వారికే ఆటోగ్రాఫ్​ ఇచ్చాడు.

ఇటీవల వెస్టిండీస్​ టూర్​లో భాగంగా కరీబియన్​ దేశం అడుగుపెట్టిన కోహ్లీ.. ఖాళీ సమయంలో భార్యతో కలిసి వివిధ ప్రదేశాల్లో సందర్శించాడు. అలా ఓ చోట విరుష్క జోడీని గుర్తించిన బాలుడు… వారి దగ్గరికి వెళ్లి ‘నా ఆటోగ్రాఫ్​ కావాలా’ అని అడిగాడు. ఆ బాబు మాటలకు అవాక్కైన అనుష్క, కోహ్లీ జోడీ.. నవ్వుతూ ఆటోగ్రాఫ్​ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ కుర్రాడి బంధువు అమిత్​ లక్ష్మీ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu