పొట్టి క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మిథాలీ రాజ్
భారత విమెన్ క్రికెట్ టీం పేరు చెప్పగానే మిథాలీ రాజ్ గుర్తొస్తుంది. ప్రపంచ మహిళా క్రికెట్‌లో చెరిగిపోలేని ముద్ర వేసిన ఈ క్రికెటర్ టీ 20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించింది. 2021 ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని టీ20 ఫార్మాట్‌కు దూరం అవుతున్నానని ఆమె తెలిపింది. భారత టీ-20 జట్టుకు తొలి కెప్టెన్‌గా 2006లో బాధ్యతలు స్వీకరించిన మిథాలీ ఇప్పటివరకు 89 మ్యాచ్‌లు ఆడింది. ఇప్పటి వరకు 32 టీ20లు ఆడిన ఆమె […]

భారత విమెన్ క్రికెట్ టీం పేరు చెప్పగానే మిథాలీ రాజ్ గుర్తొస్తుంది. ప్రపంచ మహిళా క్రికెట్‌లో చెరిగిపోలేని ముద్ర వేసిన ఈ క్రికెటర్ టీ 20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించింది. 2021 ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని టీ20 ఫార్మాట్‌కు దూరం అవుతున్నానని ఆమె తెలిపింది. భారత టీ-20 జట్టుకు తొలి కెప్టెన్‌గా 2006లో బాధ్యతలు స్వీకరించిన మిథాలీ ఇప్పటివరకు 89 మ్యాచ్‌లు ఆడింది. ఇప్పటి వరకు 32 టీ20లు ఆడిన ఆమె 2012 (శ్రీలంక), 2014 (బంగ్లాదేశ్), 2016 (భారత్)లో జరిగిన ప్రపంచకప్ టోర్నీల్లో ఆడింది.పొట్టి క్రికెట్ ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ చేసింది. 89 మ్యాచుల్లో 37.5 సగటుతో 2,364 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. టీ20ల్లో 2000 పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్ మిథాలీ.
‘2006 నుంచి భారత్‌కు టీ20ల్లో ప్రాతినిధ్యం వహించిన నేను టీ20 క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటిస్తున్నా. 2021 వన్డే ప్రపంచకప్‌పై దృష్టిపెట్టాలని భావిస్తున్నా. ఆ టోర్నీకి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని పొట్టి ఫార్మాట్‌కు దూరమవుతున్నా. నా దేశానికి ప్రపంచకప్ అందించాలన్నది ఎప్పటికీ నా కల. అత్యుత్తమంగా పోరాడాలన్నదే నా లక్ష్యం. నన్ను నిరంతరం ప్రోత్సహించిన బీసీసీఐకి ధన్యవాదాలు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడే భారత టీ20 జట్టుకు అభినందనలు’ అని మిథాలీ భావోద్వేగంతో ప్రకటించింది.