కోహ్లీసేన బంపర్ విక్టరీ.. సిరీస్ పరిపూర్ణం!

కోహ్లీసేన బంపర్ విక్టరీ.. సిరీస్ పరిపూర్ణం!

ఎప్పటిలానే అందరూ ఊహించిన మాదిరిగానే టీమిండియా ఖాతాలో మరో విజయం చేరింది. వెస్టిండీస్ పర్యటనను కోహ్లీసేన సంపూర్ణంగా ముగించింది. మొదట టీ20, ఆ తర్వాత వన్డే.. ఇప్పుడు టెస్ట్ సిరీస్‌ను వైట్‌వాష్ చేసి పర్యటనను పరిపూర్ణంగా పూర్తి చేసింది. ఆతిధ్య జట్టు ఏ విభాగంలో కూడా భారత్‌కు పోటీ ఇవ్వలేక చతికిలబడింది. కింగ్‌స్టన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 257 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 468 భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన కరీబియన్‌ […]

Ravi Kiran

|

Sep 03, 2019 | 5:07 AM

ఎప్పటిలానే అందరూ ఊహించిన మాదిరిగానే టీమిండియా ఖాతాలో మరో విజయం చేరింది. వెస్టిండీస్ పర్యటనను కోహ్లీసేన సంపూర్ణంగా ముగించింది. మొదట టీ20, ఆ తర్వాత వన్డే.. ఇప్పుడు టెస్ట్ సిరీస్‌ను వైట్‌వాష్ చేసి పర్యటనను పరిపూర్ణంగా పూర్తి చేసింది. ఆతిధ్య జట్టు ఏ విభాగంలో కూడా భారత్‌కు పోటీ ఇవ్వలేక చతికిలబడింది.

కింగ్‌స్టన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 257 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 468 భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన కరీబియన్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 210 పరుగులకే ఆలౌట్ అయింది. 45/2తో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన ప్రత్యర్థి జట్టు ఆరంభంలో కాస్త పైచేయి సాధించినా.. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఓటమి చవి చూడక తప్పలేదు. జడేజా(3/58), షమి(3/65), ఇషాంత్‌(2/37)లు బంతితో చెలరేగిపోయారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసిన భారత్‌..విండీస్‌ను 117 పరుగులకే కుప్పకూల్చింది. ఫాలోఆన్‌ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీసేన 54.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 168 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఈ టెస్టు సిరీస్‌ విజయంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కోహ్లీసేన 120 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu