పవన్‌పై తప్పుడు ప్రచారం.. జనసేన క్లారిటీ!

జనసేనాని పవన్ కళ్యాణ్ తన పదవిని వదులుకొని సినిమాల్లో నటిస్తారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఆ పార్టీ స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ పేరిట కొందరు తప్పుడు లేఖను సృష్టించినట్లు పార్టీ దృష్టికి వచ్చినట్లు జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. కాగా ఆ లేఖలో పేర్కొన్నవన్నీ కట్టు కథలేనని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన పేరిట జరుగుతున్న సేవా కార్యక్రమాలు చూసి ఓర్వలేక […]

పవన్‌పై తప్పుడు ప్రచారం.. జనసేన క్లారిటీ!
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 03, 2019 | 5:30 AM

జనసేనాని పవన్ కళ్యాణ్ తన పదవిని వదులుకొని సినిమాల్లో నటిస్తారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఆ పార్టీ స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ పేరిట కొందరు తప్పుడు లేఖను సృష్టించినట్లు పార్టీ దృష్టికి వచ్చినట్లు జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. కాగా ఆ లేఖలో పేర్కొన్నవన్నీ కట్టు కథలేనని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన పేరిట జరుగుతున్న సేవా కార్యక్రమాలు చూసి ఓర్వలేక కొంతమంది ఇలాంటి చర్యకు పాల్పడ్డారు. ఈ విషయమై కేసులు పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. నిరంతరం ప్రజలకు చేరువగా ఉండి వారి పక్షాన పోరాడడమే పవన్‌ లక్ష్యమని, అందుకు ఆయన ప్రజా క్షేత్రంలోనే ఉంటున్నారని పవన్‌ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌ పేర్కొన్నారు.