Lost Passport: పాపం కెప్టెన్.. పాస్‌పోర్ట్ పోగుట్టుకున్నాడు.. ఏకంగా సరీస్‌కే దూరమయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు..!
టీ20 టీమ్ కెప్టెన్ ఘోర తప్పిదం చేశాడు. ఫలితంగా ఒక సిరీస్‌కు దూరమయ్యే పరిస్థితికి తెచ్చుకున్నాడు.. ఇదే కారణమంటూ..
Lost Passport: శ్రీలంక టీ20 టీమ్ కెప్టెన్ దాసున్ షానక ఘోర తప్పిదం చేశాడు. ఫలితంగా ఒక సిరీస్‌కు దూరమయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు. అసలేం జరిగిందంటే.. శ్రీలంకకు చెందిన క్రికెట్ ప్లేయర్ దాసున్ షానక.. తన పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని తాజాగా గుర్తించాడు. వెస్టిండీస్ – శ్రీలంక మధ్య 3- టీ20 మ్యాచ్‌లు, 3- వన్డే మ్యాచ్‌లు, 2- టెస్ట్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనుండగా.. మంగళవారం నాడే శ్రీలంక టీమ్ అంతా విండీస్‌కు బయలుదేరింది. అయితే, టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన దాసున్ మాత్రం వెళ్లలేదు.
కారణమేంటంటే.. పాస్‌పోస్ట్ పోయిందని చావు కబురు చల్లగా చెప్పాడు. రెండేళ్ల క్రితమే ఈ పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న తనకు యూఎస్ వీసా ఉందని దాసున్ చెప్పుకొచ్చాడు. ఐదేళ్ల కాలపరిమితితో ఉన్న ఈ వీసాపై యూఎస్ఏ స్టాంప్ ఉందన్నాడు. ఇది విండీస్ వెళ్లడానికి అనుమతించరు. అయితే, కొత్త వీసా కోసం సమయానికి డాక్యూమెంట్లను సబ్మిట్ చేయలేకపోవడంతో దాసున్ ఇప్పుడు తిప్పలు పడుతున్నాడు. పాస్‌పోర్ట్ లేకుంటే దాసున్ విండీస్ వెళ్లడం కష్టతరం. ఈ నేపథ్యంలోనే అతను విండీస్ టూర్‌కు వెళతాడా? లేదా? అనేది సందేహంగా మారింది.
Also read:
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు, తెలంగాణ దేశానికే ఆదర్శవంతమయిందని వ్యాఖ్య
Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్ చేసిన రియల్ హీరో.. చివరికి ఏమైందంటే.!