India vs England 3rd Test Live: పింక్ బాల్ మ్యాచ్‌లో టీమిండియా స్కోరు 99/3.. రెండవ రోజు ఎన్ని పరుగులు చేయాలి..!

Sanjay Kasula

|

Updated on: Feb 24, 2021 | 11:20 PM

Ind vs Eng, 3rd Test: నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా సత్తా చూపించింది. పింక్ బాల్‌తో ఆడిన మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. రెండింటిలో తన పవర్ చూపించింది. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లో కూడా కోహ్లీ సేన అదరగొట్టింది.

India vs England 3rd Test Live: పింక్ బాల్ మ్యాచ్‌లో టీమిండియా స్కోరు 99/3.. రెండవ రోజు ఎన్ని పరుగులు చేయాలి..!
India vs England Narendra Modi Stadium

Ind vs Eng, 3rd Test, Day 1, LIVE Score: నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా సత్తా చూపించింది. పింక్ బాల్‌తో ఆడిన మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. రెండింటిలో తన పవర్ చూపించింది. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లో కూడా కోహ్లీ సేన అదరగొట్టింది. డే అండ్ నైట్ టెస్ట్ తొలి రోజు మ్యాచ్‌పై పట్టు బిగించేంది. టీమిండియా బౌలర్లు ఇంగ్లాండ్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. ఆట మొదలైన కాసేపటికే అక్షర్, అశ్విన్ వేసిన బంతులకు ఇంగ్లీష్ టీమ్ ఆటను చూట్టేశారు. 

నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. 33 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 99/3తో నిలిచింది. అజింక్య రహానె (1/ బ్యాటింగ్‌), రోహిత్‌ శర్మ (57/బ్యాటింగ్‌) ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లాండ్‌ 112కు ఆలౌటైన సంగతి తెలిసిందే. టీమిండియా మరో 13 పరుగుల చేయాల్సి ఉంది.

అయితే అంతకు ముందు టీమిండియా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. శుబ్‌మన్‌ గిల్‌(11), చతేశ్వర్‌ పుజారా(0)ల వికెట్లను వరుస ఓవర్లలో చేజార్చుకుంది. జోఫ్రా ఆర్చర్‌ వేసిన 15 ఓవర్‌ చివరి బంతికి గిల్‌ ఔట్‌ కాగా, ఆపై వచ్చిన పుజారా సైతం నిరాశపరిచాడు. స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ ఐదో బంతికి పుజారా వికెట్లు ముందు దొరికిపోయాడు. నాలుగు బంతులు ఆడిన పుజారా పరుగులేమీ చేయకుండా ఎల్బీగా వెనుదిరిగాడు. 17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ దూకుడుగా ఆటను మొదలు పెట్టాడు. అయితే కోహ్లీ (27/ 58 బంతు) ఔటయ్యాడు. జాక్‌ లీచ్‌ వేసిన 32.2వ బంతికి బౌల్డ్‌ అయ్యాడు. 

ఆ ఇద్దరి క్యాచులను ఒలీ పోప్ వదిలేశాడు..

30 ఓవర్లకు భారత్‌ 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (53), విరాట్‌ కోహ్లీ (24) ఆచితూచి ఆడుతున్నారు. భారీ భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరికీ లైఫ్ లభించింది. ఆ రెండు క్యాచులను ఒలీ పోప్‌ వదిలేశాడు.

భోజన విరామ సమయానికి..

తొలిరోజు ఆటలో రెండో సెషన్‌ భోజన విరామ సమయానికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. ఓపెనర్లు  రోహిత్‌ శర్మ 5 పరుగులు, శుబ్‌మన్‌ గిల్‌ సున్నా పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. కాగా అంతకముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆట తొలిరోజులో భాగంగా రెండు సెషన్లలోనూ టీమిండియా ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది.

ఇంగ్లాండ్‌ 112 ఆలౌట్‌..

నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. ఇంగ్లాండ్-భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ జట్టు పూర్తిగా తేలి పోయింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లను తమ స్పిన్ మాయజాలంతో బెంబెలేత్తించారు. ఈ ఇద్దరి బౌలింగ్‌లో ఆడటాన్ని తడబడిన ఇంగ్లండ్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ బాటపట్టారు.

1986 తర్వాత ఇప్పుడే..

ఇంగ్లండ్‌ టెస్టుల్లో టీమిండియాపై అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఓవరాల్‌గా ఇది ఐదోసారి. కాగా అత్యల్ప స్కోరుల్లో నాలుగో స్థానంలో నిలిచింది. 1971 ఓవల్‌ టెస్టులో 101 పరుగులు చేయగా..  1979/80 ముంబై టెస్టులో 102 పరుగులు చేసింది. ఆ తర్వాత 1986 లీడ్స్‌ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 102 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో 128 పరుగులు, తాజాగా అహ్మదాబాద్‌లో 112 పరుగులకు ఆలౌట్‌ అయింది.

అక్షర్‌ను ప్రశంసించిన సచిన్

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న మూడో​ టెస్టులో అక్షర్​ పటేల్​ బౌలింగ్​పై భారత క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందుల్కర్​​ తన ట్విట్టర్‌లో​ కామెంట్ చేశారు. ఇప్పటివరకు మ్యాచ్​లో ఇదే అత్యుత్తమ ఓవర్​​ ట్వీట్​ చేశాడు.

భారత్ జట్టు : రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రహనే, పంత్(వికెట్ కీపర్), సుందర్, అక్షర్ పటేల్, అశ్విన్, ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా

ఇంగ్లాండ్ జట్టు: సిబ్లి, క్రాలి, బెయిర్‌స్టో, రూట్(కెప్టెన్), స్టోక్స్, పోప్, ఫోక్స్(వికెట్ కీపర్), ఆర్చర్, లీచ్, బ్రాడ్, ఆండర్సన్

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Feb 2021 10:15 PM (IST)

    తొలి రోజు ఆట ముగిసింది.. భారత్‌ 99/3

    నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. 33 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 99/3తో నిలిచింది. అజింక్య రహానె (1/ బ్యాటింగ్‌), రోహిత్‌ శర్మ (57/బ్యాటింగ్‌) ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లాండ్‌ 112కు ఆలౌటైన సంగతి తెలిసిందే. టీమిండియా మరో 13 పరుగుల చేయాల్సి ఉంది.

  • 24 Feb 2021 09:54 PM (IST)

    రెండు క్యాచులను ఒలీ పోప్‌ వదిలేశాడు..

    30 ఓవర్లకు భారత్‌ 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (53), విరాట్‌ కోహ్లీ (24) ఆచితూచి ఆడుతున్నారు. భారీ భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరికీ లైఫ్ లభించింది. ఆ రెండు క్యాచులను ఒలీ పోప్‌ వదిలేశాడు.

  • 24 Feb 2021 09:29 PM (IST)

    రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..

    నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 63 బంతుల్లో 50 చేశాడు ఇందులో 8 బౌండరీలు ఉన్నాయి. కెరీర్లో 12వ హాఫ్ సెంచరీ సాధించాడు. స్టోక్స్‌ విసిరిన 24.4వ బంతిని బౌండరీకి బాది 49కి చేరుకున్న అతడు తర్వాతి బంతికి సింగిల్‌ తీసి లాంఛనం పూర్తి చేసుకున్నాడు. విరాట్‌ కోహ్లీ తోడుగా నిలుస్తున్నాడు. వీరిద్దరూ 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

  • 24 Feb 2021 08:36 PM (IST)

    అయ్యో..! పుజాారా కూడా ఔట్..

    టీమిండియా ‌రెండో వికెట్‌ కోల్పోయింది. టీమిండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా డకౌట్‌ అయ్యాడు. జాక్‌ లీచ్‌ వేసిన 15.5వ బంతికి పుజారా వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో భారత్‌ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. విరాట్‌ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు.

  • 24 Feb 2021 08:22 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన భారత్..

    టీమిండియా తొలి వికెట్‌‌ను కోల్పోయింది. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ (11, 51 బంతుల్లో 2×4) ఔటయ్యాడు. జోఫ్రా ఆర్చర్‌ వేసిన 14.6వ బంతిని భారీ షాట్‌ ఆడబోయి జాక్‌ క్రాలీకి క్యాచ్‌ ఇచ్చాడు.

  • 24 Feb 2021 07:38 PM (IST)

    రోహిత్ రెండో బౌండరీ..

    భోజన విరామం తర్వాత రోహిత్ బౌండరీతో ఆకట్టుకున్నాడు.

  • 24 Feb 2021 07:22 PM (IST)

    భోజన విరామ సమయానికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా..

    తొలిరోజు ఆటలో రెండో సెషన్‌ భోజన విరామ సమయానికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. ఓపెనర్లె రోహిత్‌ శర్మ 5 పరుగులు, శుబ్‌మన్‌ గిల్‌ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా అంతకముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆట తొలిరోజులో భాగంగా రెండు సెషన్లలోనూ టీమిండియా ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది.

  • 24 Feb 2021 07:05 PM (IST)

    1986 తర్వాత ఇదే తొలిసారి..

    ఇంగ్లండ్‌ టెస్టుల్లో టీమిండియాపై అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఓవరాల్‌గా ఇది ఐదోసారి. కాగా అత్యల్ప స్కోరుల్లో నాలుగో స్థానంలో నిలిచింది. 1971 ఓవల్‌ టెస్టులో 101 పరుగులు చేయగా..  1979/80 ముంబై టెస్టులో 102 పరుగులు చేసింది. ఆ తర్వాత 1986 లీడ్స్‌ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 102 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో 128 పరుగులు, తాజాగా అహ్మదాబాద్‌లో 112 పరుగులకు ఆలౌట్‌ అయింది.

  • 24 Feb 2021 06:57 PM (IST)

    రోహిత్ శర్మ తొలి బౌండరీ

    భారత ఇన్నింగ్స్‌లో బౌడరీతో రోహిత్ శర్మ తన దూకుడును మొదలు పెట్టాడు. దీనితో అతను 5 పరుగులు పూర్తి చేశాడు. రోహిత్, గిల్ ప్రస్తుతం క్రీజులో కొనసాగుతున్నారు. గిల్ కొంచెం కష్టపడుతున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లు పిచ్ నుండి కొంత బౌన్స్ బాల్స్ పడుతుండటంతో కొంత నెమ్మదిగా ఆడుతున్నారు టీమిండియా ఆటగాళ్లు.

  • 24 Feb 2021 06:50 PM (IST)

    అక్షర్​ బౌలింగ్‌పై స్పందించిన సచిన్

    మూడో టెస్టులో అక్షర్​ బౌలింగ్​పై ట్విట్టర్​ వేదికగా స్పందించాడు సచిన్ టెండుల్కర్​. అద్భుతంగా బౌలింగ్​ చేశావంటూ అక్షర్​ను కొనియాడాడు.

  • 24 Feb 2021 06:49 PM (IST)

    తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది

    టీమిండియా ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు. అయితే శుభ్‌మన్‌ గిల్‌ ఔటయ్యే ప్రమాదం తృటిలో తప్పించుకున్నాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన 1.4వ బంతిని గిల్‌ ఆడాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతి స్లిప్‌లోకి వెళ్లింది. దానిని స్టోక్స్‌ అందుకున్నాడు. అది నేలకు తగిలిందా లేదా అన్న దానిపై వీడియో ఎంపర్ నిర్ణయించారు.

    Rohit Sharma Shubman Gill

    Rohit Sharma Shubman Gill

  • 24 Feb 2021 06:17 PM (IST)

    అక్షర్ ఖాతాలో మరో వికెట్.. ఇంగ్లాండ్ ఆలౌట్

    పింక్ బాల్ డే/నైట్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 48.4 ఓవర్లకు 112 పరుగులకు ఆలౌట్‌ అయింది. అక్షర్‌ పటేల్‌ వేసిన 48.4వ బంతికి ఫోక్స్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. చివరి వికెట్‌ను కూడా తన ఖాతాలో వెసుకున్నాడు. టీమిండియా యువ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ దుమ్మురేపాడు. వరుసగా రెండో టెస్టులో ఆరు వికెట్ల ఘనత సాధించాడు.

  • 24 Feb 2021 06:07 PM (IST)

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..

    ఇంగ్లాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కొత్తగా నిర్మించిన నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడుతున్న పింక్ బాల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ 5 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌కు 9 వ వికెట్ కోల్పోయింది.

    Axar to Broad

    Axar to Broad

  • 24 Feb 2021 05:33 PM (IST)

    మరో వికెట్ పడింది.. జాక్ లీచ్ ఔట్

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు. అశ్విన్ వేసిన బంతికి  జాక్‌ లీచ్‌ ఔటయ్యాడు.

  • 24 Feb 2021 05:22 PM (IST)

    జోఫ్రా ఆర్చర్ ఔట్ ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

    ఇంగ్లాండ్ మరో వికెట్ కోల్పోయింది. ఆర్చర్‌ను అక్షర్‌ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అక్షర్‌ ఖాతాలో ఇది నాలుగో వికెట్‌.

  • 24 Feb 2021 05:13 PM (IST)

    పింక్ బాల్ టోస్ట్‌లో అక్షర్‌ దూకుడు.. బెన్‌ స్టోక్స్‌ ఔట్‌

    పింక్ బాల్ టోస్ట్‌లో టీమిండియా బౌలర్లు దూకుడుతో అదరగొడుతున్నారు. వరుస ఓవర్లలో వికెట్లు సాధిస్తున్నారు. బెన్‌ స్టోక్స్‌ను అక్షర్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. స్టోక్స్‌ రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. క్రీజులో ఫోక్స్‌, ఆర్చర్‌ ఉన్నారు.

  • 24 Feb 2021 04:55 PM (IST)

    పోప్‌ క్లీన్‌బౌల్డ్‌.. అశ్విన్‌ దూకుడు

    రెండో సెషన్‌ తొలి ఓవర్‌లోనే ప్రత్యర్థి జట్టు వికెట్ కోల్పోయింది. అశ్విన్‌ వేసిన అద్భుతమైన బంతికి పోప్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

  • 24 Feb 2021 04:43 PM (IST)

    పింక్ బాల్ టెస్ట్‌లో తొలి రోజు ఆటలో ముగిసిన మొదటి సెషన్‌

    పింక్ బాల్ టెస్ట్‌లో తొలి రోజు ఆటలోని మొదటి సెషన్‌ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ 27 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రాలే (53) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెషన్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. 20 నిమిషాల విరామం అనంతరం రెండో సెషన్‌ ప్రారంభం కానుంది.

  • 24 Feb 2021 04:19 PM (IST)

    కీలక వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ ..జో రూట్ ఔట్‌

    ఇంగ్లాండ్ జట్టు కీలక వికెట్ కోల్పోయింది. రూట్‌ను అశ్విన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన జో రూట్ ఈ మ్యాచ్‌లో 17 పరగులకే ఔటయ్యాడు.

  • 24 Feb 2021 04:15 PM (IST)

    India vs England..సెషన్‌ టైమింగ్స్‌..

    సెషన్‌ టైమింగ్స్‌..

    తొలి సెషన్‌: 2.30 నుంచి 4.30

    రెండో సెషన్‌: 4.50 నుంచి 6.50

    ఆఖరి సెషన్‌: 7.30 నుంచి 9.30 వరకు

  • 24 Feb 2021 03:50 PM (IST)

    ఓపెనర్‌ క్రాలే హాఫ్ సెంచరీ

    ఓపెనర్‌ క్రాలే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్‌ బౌలింగ్‌లో బౌండరీతో 67 బంతుల్లో హాఫ్‌ సెంచరీని చేశాడు. అతడి కెరీర్‌లో ఇది నాలుగో హాఫ్ సెంచరీ. మరో ఎండ్‌లో ఉన్న రూట్ 11 పరుగులతో జాగ్రత్తగా ఆడుతున్నాడు. క్రాలే ఆట తీరు చూస్తుంటే వన్డే మ్యాచ్‌ను తలపిస్తోంది.

  • 24 Feb 2021 03:24 PM (IST)

    స్మాల్ బ్రేక్.. డ్రింక్స్ బ్రేక్..

    ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా జోరుగా ఆడుతోంది. ఇప్పుడు స్మాల్ డ్రింక్స్ బ్రేక్..

  • 24 Feb 2021 03:13 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..తొలి బంతికే అక్షర్‌ పటేల్‌ వికెట్

    ఇంగ్లాండ్ మరో వికెట్ కోల్పోయింది. తన తొలి బంతికే అక్షర్‌ పటేల్‌ వికెట్ తీశాడు.

  • 24 Feb 2021 03:02 PM (IST)

    ఇషాంత్ 100 టెస్ట్‌.. రాష్ట్ర‌ప‌తి చేతులమీదుగా జ్ఞాపిక..

    టీమిండియా త‌ర‌ఫున వందో టెస్ట్ ఆడుతున్న పేస్‌బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మ‌కు జ్ఞాపిక‌ను భారత రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ అంద‌జేశారు‌. ప్ర‌పంచంలోనే అతిపెద్ద‌దైన క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించిన త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి టీమిండియా, ఇంగ్లాండ్‌ ప్లేయ‌ర్స్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగానే కోవింద్‌.. ఇషాంత్‌ను జ్ఞాపిక‌తో స‌త్క‌రించారు. ప‌క్క‌నే ఉన్న హోంమంత్రి అమిత్ షా.. ఇషాంత్‌కు ప్ర‌త్యేక‌మైన క్యాప్ అందించారు. ఆ త‌ర్వాత రెండు జ‌ట్ల కెప్టెన్లు కోహ్లి, రూట్.. టీమ్ ప్లేయ‌ర్స్‌ను రాష్ట్ర‌ప‌తికి ప‌రిచయం చేశారు. ఇక ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టేడియంలో వందో టెస్ట్ ఆడుతున్న ఇషాంత్‌కే తొలి బంతి వేసే అవ‌కాశం రావ‌డం విశేషం.

  • 24 Feb 2021 02:51 PM (IST)

    ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో సిబ్లీ డకౌట్‌

    ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో షాట్‌ కోసం ప్రయత్నించిన సిబ్లీ స్లిప్‌లో ఉన్న రోహిత్ చేతికి ఇంటిముఖం పట్టాడు. క్రీజులో బెయిర్‌ స్టో, క్రాలే ఉన్నారు.

  • 24 Feb 2021 02:49 PM (IST)

    ఇషాంత్ 100వ టెస్టు..

    ఇషాంత్ శర్మ తన కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్నాడు. కపిల్‌దేవ్ తర్వాత వంద టెస్టులు ఆడిన భారత్‌ పేసర్ ఇషాంత్ మాత్రమే.

  • 24 Feb 2021 02:46 PM (IST)

    మొతేరా స్టేడియంకు నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్పు

    గుజరాత్​ మొతేరాలోని ప్రపంచంలోనే అతిపెద్దదైన సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ స్టేడియం పేరును మార్చారు. ప్రధాన మంత్రి పేరు మీదగా.. నరేంద్ర మోదీ స్టేడియంగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అధికారికంగా ప్రకటించారు.

Published On - Feb 24,2021 10:15 PM

Follow us