Sachin Tendulkar: సరిగ్గా 11 ఏళ్లు.. ప్రపంచమంతా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వైపే చూసిన అద్భుత సన్నివేశం..
సచిన్ పేరు వింటేనే క్రికెట్ అభిమానులు ఉప్పొంగిపోతారు. క్రికెట్ లో ఎన్నో అద్భుతాలు సృష్టించిన సచిన్ టెండూల్కర్..
Sachin Tendulkar: సచిన్ పేరు వింటేనే క్రికెట్ అభిమానులు ఉప్పొంగిపోతారు. క్రికెట్ లో ఎన్నో అద్భుతాలు సృష్టించిన సచిన్ టెండూల్కర్.. వన్డే మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ చేసిన మొదటి క్రికెటర్ గా రికార్డ్ సృష్టించాడు. ఫిబ్రవరి 24, 2010 న దక్షిణాఫ్రికాతో జరిగిన ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్‌లో సచిన్ 200 పరుగులతో డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.
అంతకు ముందు పాకిస్తాన్ ఓపెనర్ సయీద్ అన్వర్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 194 పరుగులు చేశాడు. అప్పుడదే అత్యధిక స్కోర్. చాలా మంది ప్లేయర్లు ఆ రికార్డ్ దరిదాపుల్లోకి వచ్చినప్పటికీ.. ఆ స్కోర్‌ను మాత్రం బీట్ చేయలేకపోయారు. దాంతో 194 పరుగులను దాటడం ఎవరి వల్లా కాదని అనుకునేవారు అంతా. కానీ, ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ డెండూల్కర్ ఆ ఊహలను పటాపంచల్ చేసేశాడు. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ డబుల్ సెంచరీ చేసి.. పాత రికార్డ్‌ను బద్దలుకొట్టాడు. తన పేరిట తొలి డబుల్ సెంచరీని నమోదు చేశాడు.
చివరి బంతి వరకూ ఆడిన సచిన్.. వాస్తవానికి, ఈ మ్యాచ్ ఫిబ్రవరి 24, 2010 న గ్వాలియర్‌లో ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగింది. అప్పుడు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. టాస్ గెలిచిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన వీరేందర్ సెహ్వాగ్ 9 పరుగులకే ఔట్ అయ్యాడు. దాంతో భారత్ 25 పరుగులకే తొలి వికెట్‌న్ కోల్పోయింది. కానీ, అటువైపు ఉన్న సచిన్ టెండూల్కర్ ఏమాత్రం తగ్గలేదు. అదిరిపోయే షాట్లతో మ్యాచ్‌ను రక్తికట్టించాడు. 50వ ఓవర్ చివరి బంతి వరకూ ఉన్న సచిన్.. 147 బంతుల్లో 200 పరుగులు చేశాడు. ఇందులో 25 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. దాంతో వన్డే చరిత్రలో సచిన చేసిన 200 పరుగులే మొదటి డబుల్ సెంచరీగా రికార్డులకెక్కింది.
చివరి ఐదు ఓవర్లలో సచిన్ ఆడింది కేవలం 9 బంతులే.. 45వ ఓవర్ సమయానికి సచిన్ టెండూల్కర్ స్కోర్ 191గా ఉంది. ఆ సమయంలోనే ఉత్కంఠ మరింత పెరిగింది. 46వ ఓవర్‌లో ధోనీ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. అలా మిగిలిన ఐదు ఓవర్లలో ధోనీనే ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకున్నాడు. ఈ 5 ఓవర్లలో సచివన్ కేవలం 9 బంతులు మాత్రమే ఆడాడు. కానీ, ఆ తొమ్మిది బంతులే క్రికెట్ హిస్టరీలో సచిన్ పేరును చిరస్థాయిగా నిలబెట్టాయి. చివరి బంతి వరకూ బ్యాటింగ్ చేసిన సచిన్.. 200 పరుగులు చేసి సయీద్ అన్వర్ పేరిట ఉన్న 194 పరుగుల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ స్కోర్‌ను బీట్ చేయడానికి 13 సంవత్సరాలు పట్టిందనేది విశేషం. కాగా, ఆ మ్యాచ్‌లో సచిన్‌తో పాటు దినేష్ కార్తీక్ 85 పరుగులు చేయగా.. ధోనీ కేవలం 35 బంతుల్లో 68 పరుగులు చేశాడు. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో 153 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
ఇదిలాఉంటే.. సచిన్ తరువాత ఎంతోమంది డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్స్ లైమ్‌లైట్‌లోకి వచ్చారు. సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేసిన మరుసటి సంవత్సరమే మరో టీమిండియా బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ డబుల్ సెంచరీ రికార్డ్‌ను బీట్ చేశాడు. ఏకంగా 219 పరుగులు చేశాడు. సేహ్వాగ్ మాత్రమే కాదు.. క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ వంటి ప్లేయర్లు కూడా ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టిన వారిలో ఉన్నారు.
వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన మరికొందరు క్రీడాకారులు.. 1. డిసెంబర్ 8, 2011 వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్‌లో భారత్ కు చెందిన వీరేంద్ర సెహ్వాగ్ 219 పరుగులు 2. నవంబర్ 2, 2013 ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ క్రీడాకారుడు రోహిత్ శర్మ 209 పరుగులు 3. నవంబర్ 13,2014 శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు చెందిన రోహిత్ శర్మ 264 పరుగులు 4. మే 21, 2015 వెస్టీండీస్ తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ కు చెందిన ఎంజే గుప్తిల్ 237 పరుగులు 5. ఫిబ్రవరి 24, 2015 జింబాబ్వే తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ కు చెందిన క్రిస్ గేల్ 215 పరుగులు 6. డిసెంబర్ 13, 2017 శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ క్రీడాకారుడు రోహిత్ శర్మ 208 పరుగులు 7. జులై20, 2018 జింబాబ్వే తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రీడాకారుడు ఫఖర్ జమాన్ 210 పరుగులు
Also read:
‘ఉప్పెన’ కోసం ఎగబడుతున్న దర్శక నిర్మాతలు.. పలు భాషల్లో రీమేక్ కానున్న మెగాహీరో డెబ్యూమూవీ..