Sourav Ganguly Health Update: నిలకడగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్‌ గంగూలీ ఆరోగ్యం.. 6న డిశ్చార్జ్‌..!

Sourav Ganguly Health Update: భారత మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్‌ గంగూలీ ఆరోగ్యం మెరుగు పడుతోందని వైద్యులు వెల్లడించారు. బుధవారం గంగూలీ ఆస్పత్రి...

Sourav Ganguly Health Update: నిలకడగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్‌ గంగూలీ ఆరోగ్యం.. 6న డిశ్చార్జ్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 05, 2021 | 3:11 AM

Sourav Ganguly Health Update: భారత మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్‌ గంగూలీ ఆరోగ్యం మెరుగు పడుతోందని వైద్యులు వెల్లడించారు. బుధవారం గంగూలీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే అవకాశాలున్నాయని వుడ్‌ల్యాండ్‌ ఆస్పత్రి సీఈవో డాక్టర్‌ రూపాలీ బసు తెలిపారు. మరోసారి యాంజియోప్లాస్టి చేయాలనే దానిపై కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగా ఉందని, 6వ తేదీన డిశ్చార్జ్‌ అయ్యే అవకాశాలున్నాయని అన్నారు.

కాగా, 48 ఏళ్ల గంగూలీ శనివారం ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో యాంజియోప్లాస్టి వాయిదా వేయడమే మంచిదని బోర్డు సభ్యులు భావించినట్లు డాక్టర్‌ రూపాలీ బసు తెలిపారు. ఈ బోర్డు సమావేశంలో ప్రముఖ కార్డియాలజిస్ట్‌లు డాక్టర్‌ దేవి శెట్టి, కేఆర్‌ పాండా వర్చువల్‌ వేదికగా హాజరయ్యారని, అమెరికా నుంచి మరో వైద్య నిపుణుడు కూడా ఫోన్‌లో పాల్గొన్నారని వెల్లడించారు.

కాగా, ఉడ్‌ల్యాండ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాదాను కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకొని సాధారణ స్థితికి రావాలని ఆయన ఆకాంక్షించారు. దాదా క్రికెట్‌ ఐకాన్‌గా ఉంటేనే బాగుంటుందని అన్నారు. దేశానికి దాదా ఓ హీరో అని, క్రికెట్‌లో అనేక ఒడిదొడుకులు చూశారని, అనేకసార్లు ప్రత్యర్థులను సైతం ఒడించారని అన్నారు.

Also Read:

Australian Open Quarantine: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వారంటైన్‌ సెంటర్‌పై ఆందోళన.. కోర్టులో కేసు వేస్తాం..

టీమిండియాపై క్వీన్స్​ల్యాండ్ ఆరోగ్య మంత్రి అనుచిత వ్యాఖ్యలు… రాస్ బేట్స్​పై బీసీసీఐ ఆగ్రహం