AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: టీమిండియాకు బిగ్ బూస్ట్.. అగ్రస్థానానికి రోహిత్ శర్మ.. గంభీర్‌కు గట్టిగానే ఇచ్చిపడేశాడుగా..

Team India: తాజాగా ఐసీసీ వన్డే, టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఇందులో వన్డే బ్యాటింగ్ కేటగిరీలో రోహిత్ శర్మ అగ్రస్థానానికి చేరుకున్నాడు. మొన్నటివరకు సెకండ్ ప్లేస్‌లో కొనసాగిన రోహిత్ మళ్లీ టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న క్రమంలో ఇది మంచి పరిణామమని చెప్పవచ్చు.

Rohit Sharma: టీమిండియాకు బిగ్ బూస్ట్.. అగ్రస్థానానికి రోహిత్ శర్మ.. గంభీర్‌కు గట్టిగానే ఇచ్చిపడేశాడుగా..
Rohit Sharma
Venkatrao Lella
| Edited By: |

Updated on: Nov 26, 2025 | 5:15 PM

Share

ICC ODI Rankings: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచంలోనే వన్డేల్లో టాప్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో రోహిత్ శర్మ ఎగబాకి తిరిగి తొలి స్థానానికి చేరుకున్నాడు. మొన్నటివరకు న్యూజిలాండ్ బ్యాటర్ రాడిల్ మిచెల్ తొలి స్థానంలో ఉన్నాడు. కానీ వెస్టిండీస్‌పై జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లను అతడు కోల్పోవడంతో ర్యాంకింగ్స్‌లో దిగజారిపోయాడు. నవంబర్ 30 నుంచి ఇండియా-సౌతాఫ్రికా మధ్య రాంచీలో తొలి వన్డే ప్రారంభం కానుంది. దీనికి నాలుగు రోజుల ముందు విడుదలైన ఈ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ అగ్రస్థానానికి చేరుకోవడం టీమిండియా ఫ్యాన్స్‌ను మరింత ఉత్సాహపరుస్తుంది.  రోహిత్ శర్మ మళ్లీ ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలోకి రావడం టీమిండియాకు కూడా శుభపరిణామం మారింది. అతడిని రానున్న టీ20 ప్రపంచకప్‌ కోసం ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా ఇది జరగనుంది. ఈ తరణంలో వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం గమనార్హం.

ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్

రోహిత్ 781 రేటింగ్స్‌తో తొలి స్ధానంలో ఉండగా.. మిచెల్ 764 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఆఫ్గనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ మూడో స్థానంలో ఉండగా.. ఇండియా బ్యాటర్ శుభమన్ గిల్ 745 పాయింట్లతో నాలుగో స్ధానం, 725 పాయింట్లతో విరాట్ కోహ్లీ టాప్ 5లో ఉన్నాడు. ఇక పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ అజామ్ 6వ స్థానంలో ఉండగా.. ఐర్లాండ్ ప్లేయర్ టెక్టార్ ఏడో స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 8వ స్థానం, శ్రేయస్ అయ్యర్ కొంచెం దిగజారి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.

జడేజా అగ్రస్థానం

ఇక టెస్టుల్లో ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా తొలి స్థానాన్ని నిలుపుకున్నాడు. రెండో స్థానంలో బంగ్లాదేశ్ మెహిదీ హసన్ మీరాజ్, మూడో స్థానంలో ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్ కమ్మిన్స్, నాలుగో స్థానంలో మిచెల్ స్టార్క్, ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా మార్కో జాన్సెస్ ఉన్నారు. ఇక టీమిండియా నుంచి ఆల్‌రౌండర్ల జాబితాలో వాషింగ్టన్ సుందర్ 12వ స్థానంలో ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..