ఇండియన్ మాజీ క్రికెటర్ కుటుంబంలో తీవ్ర విషాదం.. ఆత్మహత్య చేసుకున్న పుజారా బావమరిది!
ఇండియన్ మాజీ క్రికేటర్ చేతేశ్వర్ పుజారా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన బావమరిది జీత్ పబారి తాజాగా తను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. జిత్ ఇంట్లో వేలాడుతూ కనిపించగా అతన్ని కుటుంబ సభ్యులు స్థానిక హాస్పిటల్‌కు తరలించినట్టు తెలుస్తోంది. కానీ అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు నిర్ధారించారని సమాచారం.

భారత మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా బావమరిది జీత్ రసిక్‌భాయ్ పబారి బుధవారం తన రాజ్‌కోట్ నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోని వేలాడుతూ కనిపించిన జిత్‌ను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని స్థానిక హాస్పిటల్‌కు తరలించినట్టు తెలుస్తోంది. కానీ అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించినట్టు సమాచారం. ఇక విషయం తెలుసుకున్న మాలవీయనగర్ పోలీసు బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరకుంది. అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే గత కొన్ని రోజులుగా జీత్ డిప్రెషన్‌లో ఉన్నాడని పోలీసులు తెలుసుకున్నారు. ఇందుకు కారణంగా సరిగ్గా ఎడాది క్రితం అతనిపై ఒక అత్యాచారం కేసు నమోదు కావడమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ప్రకారం.. నవంబర్ 26, 2024న, జీత్ మాజీ కాబోయే భార్య మాల్వియా నగర్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై అత్యాచారం కేసు పెట్టింది. వివాహం పేరుతో జీత్ బలవంతంగా తనతో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడని ఫిర్యాదులో ఆరోపించింది. ఈ కారణంగానే తను గత కొన్ని రోజులుగా డిప్రెషన్లో ఉన్నారని.. సరిగ్గా ఈ కేసు నమోదైన తేదీలే అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, ఆత్మహత్య వెనుక ఉన్న ఖచ్చితమైన కారణం పోస్ట్ మార్టం నివేదిక, తదుపరి విచారణ తర్వాత మాత్రమే చెప్పగలమని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. పోలీసులు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా తన తమ్ముడి మరణంపై పుజారా భార్య, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
