మొన్న 0-3.. నేడు 0-2.. కట్‌చేస్తే.. గంభీర్ పోస్ట్‌కే ఎసరెట్టేసిన బీసీసీఐ.. టెస్ట్ కోచ్‌గా మన తెలుగోడే?
Who will be India’s next coach: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను భారత్ గెలుచుకున్నప్పటికీ, టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం జట్టు ప్రదర్శన దిగజారడం గంభీర్‌పై వేటు పడేందుకు ప్రధాన కారణంగా మారుతోంది. త్వరలోనే బీసీసీఐ దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Who will replace Gautam Gambhir?: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం పాలైన తర్వాత భారత క్రికెట్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే స్వదేశంలో న్యూజిలాండ్‌పై 0-3 తేడాతో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా, ఇప్పుడు దక్షిణాఫ్రికా చేతిలోనూ 0-2 తేడాతో ఓటమి చవిచూడటంతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Team India’s next head coach update)పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరుస వైఫల్యాల కారణంగా గంభీర్ పదవి ప్రస్తుతం ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ (BCCI) గంభీర్‌ను టెస్ట్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించి, ఆ బాధ్యతలను మరో మాజీ దిగ్గజానికి అప్పగించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో తదుపరి కోచ్‌గా ఎవరుంటే బెస్ట్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా, ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక వార్తలు రాలేదు.
IND vs SA: ఏరికోరి టీమిండియా కోచ్‌గా వచ్చింది ఇందుకేనా గంభీర్.. తొక్కలో స్ట్రాటజీతో కొంపముంచావ్‌గా..
రేసులో వీవీఎస్ లక్ష్మణ్..
ఒకవేళ బీసీసీఐ గంభీర్‌ను తొలగించాలని నిర్ణయిస్తే, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం బీసీసీఐకి చెందిన ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లో హెడ్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరిస్తున్న లక్ష్మణ్, గతంలో గంభీర్ జట్టుతో లేని సమయాల్లో తాత్కాలిక కోచ్‌గా సేవలు అందించారు. టెస్ట్ జట్టుకు లక్ష్మణ్‌ను కోచ్‌గా నియమించడంపై బోర్డు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఇదికూడా చదవండి: గంభీర్, అగార్కర్‌ల మూర్ఖత్వానికి నలుగురు బలి.. టీమిండియా నుంచి ఇలా గెంటేశారేంటి..?
టెస్ట్ కోచ్‌గా గంభీర్ రికార్డు ఇదే..

2024లో భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్, టెస్ట్ క్రికెట్‌లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయారు.
ఆయన కోచింగ్‌లో భారత్ ఇప్పటివరకు 19 టెస్టులు ఆడగా, కేవలం 7 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది.
ఏకంగా 10 మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమి పాలవ్వగా, 2 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను భారత్ గెలుచుకున్నప్పటికీ, టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం జట్టు ప్రదర్శన దిగజారడం గంభీర్‌పై వేటు పడేందుకు ప్రధాన కారణంగా మారుతోంది. త్వరలోనే బీసీసీఐ దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








