AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India Records: సౌతాఫ్రికాతో ఘోర పరాజయం.. టీమిండియా రెండు అత్యంత చెత్త రికార్డులు.. అదీ మన గడ్డపైనే..

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయంతో టీమిండియా అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ పరాజయంతో గౌతమ్ గంభీర్ కోచ్ పదవిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతడిని కోచ్ నుంచి తొలగించాలనే డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. అయతే ఈ పరాజయంతో టీిమిండియా చెత్త రికార్డులను నెలకొల్పింది.

Team India Records: సౌతాఫ్రికాతో ఘోర పరాజయం..  టీమిండియా రెండు అత్యంత చెత్త రికార్డులు..  అదీ మన గడ్డపైనే..
India And South Africa
Venkatrao Lella
|

Updated on: Nov 26, 2025 | 5:45 PM

Share

South Africa vs india: భారత గడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. దీంతో ఆ జట్టు భారత గడ్డపై 25 ఏళ్ల తర్వాత తొలి టెస్ట్ సిరీస్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా టెస్ట్ కెప్టెన్ టెంబా బావుమా హాన్సీ క్రోంజే సరసన చేరాడు. హాన్సీ క్రోన్జే నేతృత్వంలోని సౌతాఫ్రికా 2000లో టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను వైట్ వాష్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు టెంబా బావుమా ఆధ్వరంలోని జట్టు 25 ఏళ్లకు మళ్లీ టీమిండియాపై గెలిచి రికార్డు సృష్టించింది.

టీమిండియా చెత్త రికార్డ్

అయితే ఈ పరాజయంతో భారత్ అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీమిండియా టెస్టు చరిత్రలో స్వదేశంలో అతిపెద్ద ఓటమిగా ఇది నిలిచింది. గతంలో 1996లో దక్షిణాఫ్రికాతో కోల్‌కత్తాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 329 పరుగులు, 2017లో పూణేలో ఆస్ట్రేలియాతో 333, 2007లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో 337, 2006లో కరాచీలో పాకిస్తాన్‌తో 341, 2004లో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో 342 పరుగుల తేడాతో టీమిండియా ఘోర పరాజయలను మూటకట్టుకుంది. ఆ తర్వాత ఇప్పుడు అంతకంటే ఎక్కువగా 408 పరుగుల భారీ తేడాతో పరాజయం చెంది అత్యత చెత్త రికార్డును మూటకట్టుకుంది.

రెండో అతి పెద్ద విజయం

టీమిండియాపై భారీ విజయంతో దక్షిణాఫ్రికా రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికా 2018లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాతో 492 పరుగులతో గెలుపొందింది. ఆ తర్వాత ఇది ఆ జట్టుకు రెండో అతిపెద్ద టెస్ట్ విజయంగా చెప్పవచ్చు.

భారత్ ఖాతాలో మరో చెత్త రికార్డ్

ఇక వరుసగా స్వదేశీ టెస్ట్ మ్యాచ్‌లలో ఓటమి చెందటం భారత్‌కు ఇది రెండోసారి. గత సంవత్సరం న్యూజిలాండ్ 0-3 వైట్ వాష్‌తో భారత్‌ను ఓడించగా.. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో పరాజయం పాలైంది. గతంలో 1983లో స్వదేశంలో వెస్టిండీస్, 1984లో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌ను భారత్ వరుసగా కోల్పోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చెక్కుల వెనుక సంతకం ఎందుకు చేయాలి?
చెక్కుల వెనుక సంతకం ఎందుకు చేయాలి?
ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. సచివాలయం వేదికగా కీలక..
ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. సచివాలయం వేదికగా కీలక..
ఈ రాశుల వారికి మౌనీ అమావాస్యతో ఆ గండం తప్పినట్లే.. ఇక నుంచి లక్కు
ఈ రాశుల వారికి మౌనీ అమావాస్యతో ఆ గండం తప్పినట్లే.. ఇక నుంచి లక్కు
మకర సంక్రాంతి రోజు మటన్ ముట్టకూడదా? పండితులు ఏమంటున్నారంటే?
మకర సంక్రాంతి రోజు మటన్ ముట్టకూడదా? పండితులు ఏమంటున్నారంటే?
ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.10 వేలు
ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.10 వేలు
సంక్రాంతి ఎప్పుడు? జనవరి 14 లేదా 15? ఇలా మీరే నిర్ణయించుకోండి
సంక్రాంతి ఎప్పుడు? జనవరి 14 లేదా 15? ఇలా మీరే నిర్ణయించుకోండి
ఒకే దెబ్బకు కోహ్లీ, గిల్ రికార్డులు క్లోజ్.. వైభవ్ మాములోడు కాదు
ఒకే దెబ్బకు కోహ్లీ, గిల్ రికార్డులు క్లోజ్.. వైభవ్ మాములోడు కాదు
'పరాశక్తి' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
'పరాశక్తి' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
చిక్కుడులా కనిపించే అనపకాయ గింజలతో అద్భుతమైన ఆరోగ్యం! పోషకాల నిధి
చిక్కుడులా కనిపించే అనపకాయ గింజలతో అద్భుతమైన ఆరోగ్యం! పోషకాల నిధి
కారులో ఆ పాడు సీన్‌ పై రచ్చ.. డిలీట్ చేయాలంటూ డిమాండ్
కారులో ఆ పాడు సీన్‌ పై రచ్చ.. డిలీట్ చేయాలంటూ డిమాండ్