మహిళల క్రీడలు.. బంగారపు పతకాలు అనగానే ఠక్కున గుర్తొచ్చేపేరు పరుగుల రాణి పీటీ ఉష. దేశ కీర్తి కిరీటాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేసిన ఉష.. ఎన్నో పథకాలను, అవార్డులను సొంతం చేసుకుంది. భారత మహిళా ట్రాక్ అండ్కే ఫీల్డ్‌లో కేరళ కుట్టీ పిలావుళ్ళకండి తెక్కే పఱంబిల్ ఉష 1979 నుంచి దేశానికి పలు విజయాలను అందించారు. 1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలు, రజిత పతకం సాధించి రికార్డు సృష్టించింది. తాజాగా పీటీ ఉషకు సంబంధించిన ఓ రేర్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో చిరునవ్వుల చిందిస్తూ.. ఒడిలో ఓ పాపను పట్టుకుని కుర్చుంది. ఆ చిన్నారి కూడా ఇప్పుడు ఫేమస్ క్రీడాకారిణి. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.
పీటీ ఉష ఒడిలో కూర్చున్న ఆ చిన్నారి ఆటకు ఇప్పుడు దేశంలోనే కాకుండా… ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. మన హైదరాబాద్‌కు చెందిన ఈ క్రీడాకారిణి.. ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో దూసుకుపోతుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ఆమె శుభారంభం చేసింది. ఇప్పుడైనా గుర్తుపట్టారా…
పరుగుల రాణి పీటీ ఉష ఒడిలో కూర్చున్న ఆ చిన్నారి మరెవరో కాదండోయ్.. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. 2001లో పయోలి ఎక్స్‌ప్రెస్ ట్రాక్ నుంచి రిటైర్డ్ అయిన సంవత్సరంలో తీసినది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి చేరిన పీవీ సింధు రజత పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సింధు ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో మహిళ సింగిల్స్‌లో భాగంగా ఆదివారం ఇజ్రాయెల్ కు చెందిన సెనియా పోలికర్పోవాతో జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు వరుస సెట్లతో గెలుపొంది మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
ట్వీట్..
The passion and dedication for the sport will always be rewarded when hardwork comes into play. @Pvsindhu1 success will inspire generations to come! Hefty congratulations on winning the Gold at #BWFWorldChampionships2019 🇮🇳 pic.twitter.com/xBP7RgOHnt
— P.T. USHA (@PTUshaOfficial) August 25, 2019
Also Read: Marigold Flower Business: అదిరిపోయే బిజినెస్ ఐడియా.. బంతిపూల సాగుతో లక్షల్లో ఆదాయం..