Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunil Chhetri: భార‌త ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి జీవితంపై ఫిఫా డాక్యుమెంట‌రీ.. ప్రధాని మోదీ ప్రశంసలు

భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి జీవితం, కెరీర్‌పై మూడు ఎపిసోడ్‌ల సిరీస్‌ను విడుదల చేయడం ద్వారా FIFA అతనిని సత్కరించింది.

Sunil Chhetri: భార‌త ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి జీవితంపై ఫిఫా డాక్యుమెంట‌రీ.. ప్రధాని మోదీ ప్రశంసలు
Sunil Chhetri
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 29, 2022 | 5:30 PM

భారత ఫుట్‌బాల్ లెజండరీ ఆటగాడు, జ‌ట్టు కెప్టెన్ సునీల్‌ ఛెత్రికి అరుదైన గౌర‌వం దక్కింది. సునీల్ ఛెత్రి జీవితం, కెరీర్‌పై ప్రపంచ ఫుట్‌బాల్ ఫెడరేషన్  (ఫిఫా) ఓ ప్ర‌త్యేక డాక్యుమెంటరీని రూపొందించింది. మూడు ఎపిసోడ్‌లుగా ఉన్న ఈ డాక్యుమెంట‌రీని తాజాగా ఫీఫా విడుద‌ల చేసి ఆయనను సత్కరించింది. ఈ డాక్యుమెంటరీలో సునీల్ ఛెత్రి సాధించిన విజయాలతో పాటు భార‌త జ‌ట్టులోకి రావడానికి అత‌ను పడిన కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపించింది. “కెప్టెన్‌ ఫెంటాస్టిక్‌” పేరుతో ఈ డాక్యుమెంటరీని త‌న అధికారిక స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ అయిన‌ ఫిఫా లో పోస్ట్ చేసింది. FIFA తన వరల్డ్ కప్ హ్యాండిల్ నుండి ఇలా ట్వీట్ చేసింది.

ప్రపంచ దిగ్గ‌జ ఫుట్ బాట‌ర్లు క్రిస్టియానో రొనాల్డో, ఫుట్‌బాల్ మాత్రికుడు లియోన‌ల్‌ మెస్సీ గురించి మీ అంద‌రికీ తెలుసు. ఇప్పుడు అత్యధిక అంత‌ర్జాతీయ గోల్స్ సాధించిన మూడో ఆటగాడి గురించి కూడా మీరు తెలుసుకోండి” అంటూ ఫిఫా తన పోస్టులో పేర్కొన్న‌ది.

ప్రధాని మోదీ ప్రశంసలు..

సాధార‌ణంగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన ఆట‌గాళ్ల గురించి ఫిఫా ఇలాంటి డాక్యుమెంట‌రీలు చేస్తుంటుంది. ఛెత్రిపై ఇలాంటి ఎడిసోడ్ చేసిందంటే అది చాలా గొప్ప విష‌యం. ఇది ఛెత్రితో పాటు భార‌త ఫుట్‌బాల్‌కు కూడా గ‌ర్వ‌కార‌ణం అని చెప్పవచ్చు. ఫీఫా సత్కారం తర్వాత  ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స్పందించారు. ఛెత్రికి అభినందనలు తెలిపారు. భార‌త్ లో ఫుట్ బాల్ మ‌రింత‌గా ప్రాచుర్యం పొందేందుకు ఇది దోహ‌ద‌ప‌డుతుంద‌ని ట్వీట్‌లో పేర్కొన్నారు ప్రదాని మోదీ.

భారతదేశపు అత్యంత విజయవంతమైన ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో ఒకరు, ఛెత్రీ దేశం యొక్క ఆల్-టైమ్ టాప్ గోల్ స్కోరర్ మరియు అత్యధిక మ్యాచ్‌లు ఆడాడు. 2005లో భార‌త్‌ తరఫున అరంగేట్రం చేసిన సునీల్ ఛెత్రి త‌ర్వాత కెప్టెన్‌గా ఎదిగి జ‌ట్టును ముందుకు న‌డిపిస్తున్నాడు. ఛెత్రి ఇప్పటివరకు 131 మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వ‌హించి 84 అంత‌ర్జాతీయ‌ గోల్స్‌ చేశాడు. అత్య‌ధిక గోల్స్ చేసిన జాబితాలో అతనిది మూడో స్థానం. రొనాల్డో (117), మెస్సీ (90) ముందున్నారు.

మొదటి భాగంలో..

38 ఏళ్ల కెప్టెన్ ప్రస్తుతం ఫుట్ బాల్ దిగ్గజాలైన లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో ​​రొనాల్డో తర్వాత మూడవ అత్యధిక క్రియాశీల అంతర్జాతీయ గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ సిరీస్‌లోని మొదటి ఎపిసోడ్‌లో ఛెత్రి అరంగేట్రం, అతని ఫుట్‌బాల్ కెరీర్ ప్రారంభ రోజులను చూపించింది. మొదటి ఎపిసోడ్ ఎక్కచి నుంచి ప్రారంభించిందో అక్కడికి తీసుకెళ్తుంది.

రెండవ భాగంలో..

రెండవ ఎపిసోడ్ ఛెత్రి జాతీయ జట్టుతో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆడాలనే అతని కలను సాకారం చేసుకున్న కథను చెబుతుంది.

మూడవ ఎపిసోడ్‌లో..

మూడవ, చివరి ఎపిసోడ్ ఛెత్రి తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నత స్థాయికి ఎదుగుతాడో చూపిస్తుంది. FIFA బ్రెజిల్, బార్సిలోనా లెజెండ్ రొనాల్డినో, ఇంగ్లాండ్ లెజెండ్ గ్యారీ లినేకర్‌లపై ఒక డాక్యుమెంటరీని కూడా విడుదల చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం