Jasprit Bumrah Injured: ప్రపంచకప్‌ ముందు టీమిండియాకు భారీ షాక్.. పేసర్ జస్ప్రీత్ బుమ్రా మెగా టోర్నీ నుంచి ఔట్.. అతని స్థానంలో ఇతనే..

భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్‌లో పేస్ దిగ్గజం బుమ్రా ఆడడం లేదు.

Jasprit Bumrah Injured: ప్రపంచకప్‌ ముందు టీమిండియాకు భారీ షాక్.. పేసర్ జస్ప్రీత్ బుమ్రా మెగా టోర్నీ నుంచి ఔట్.. అతని స్థానంలో ఇతనే..
Jasprit Bumrah
Follow us

|

Updated on: Sep 29, 2022 | 6:05 PM

ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌ ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్‌లో పేస్ దిగ్గజం బుమ్రా ఆడడం లేదు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌తో జస్ప్రీత్ బుమ్రా తిరిగి ఫామ్‌లోకి వస్తాడని అందరూ భావించారు. అయితే మరోసారి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ప్రాక్టీసు సెషన్‌లో వెన్ను నొప్పితో బాధపడిన బుమ్రా.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆడడం లేదు. వెన్ను నొప్పికి ప్రస్తుతం సర్జరీ అవసరం లేకున్నా.. 4 నుంచి 6 నెలల విశ్రాంతి తప్పనిసరి అని డాక్టర్లు చెబుతున్నారు. ఫలితంగా త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి బుమ్రా దూరమైనట్టయ్యింది.

ఆసియా కప్‌లో భారత్‌ చావుదెబ్బ తింది. కనీసం ప్రపంచ కప్‌లోనైనా టీమిండియా రాణిస్తుందని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో బుమ్రా లాంటి బౌలర్‌ దూరవమడం భారత్‌కు పెద్ద లోటే అని చెప్పవచ్చు.

ఆసియా కప్‌లో భారత బౌలింగ్‌ దళం తేలిపోయింది. బుమ్రా, జడేజా లాంటి బౌలర్లు లేని లోటు స్పష్టంగా కనిపించింది. కనీసం ప్రపంచ కప్‌ వరకైనా బుమ్రా అందుబాటులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ బుమ్రా గాయం తిరగబెట్టడం జట్టుకు ఇబ్బందులు సృష్టిస్తోంది.

దక్షిణాఫ్రికాతో తొలి టీ20 ఆడలేక..

బుమ్రా తీవ్రమైన వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నాడని, అతను కొన్ని నెలలపాటు జట్టుకు దూరంగా ఉండాల్సి ఉంటుందని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) అధికారి పిటిఐకి తెలిపింది. బిసిసిఐ అధికారి ఒకరు పిటిఐతో మాట్లాడుతూ.. “బుమ్రా టి 20 ప్రపంచ కప్‌లో ఆడలేడని ఖచ్చితంగా చెప్పవచ్చు. అతనికి తీవ్రమైన వెన్నునొప్పి ఉంది. ఆరు నెలల పాటు బయట ఉండాల్సి రావచ్చు.” బుమ్రా ఆస్ట్రేలియాతో రెండు T20 మ్యాచ్‌లు ఆడాడు కానీ దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆడేందుకు తిరువనంతపురం వెళ్లలేదు.

మహ్మద్ షమీ సహా రేసులో ముగ్గురు ఆటగాళ్లు..

జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఎవరిని తీసుకోవాలనే ప్రశ్నపై సెలక్టర్లు అయోమయంలో పడ్డారు. బుమ్రా చాలా కాలంగా వెన్నునొప్పితో పోరాడుతున్నాడు. అయితే అతను ప్రపంచ కప్ సమయంలో ఇలా జరుగుతుదని ఎవరూ ఊహించలేక పోయారు. అయితే ఒక్కసారిగా ఇలా జరగడంతో అంతా ఆలోచనల్లో పడిపోయారు. జస్ప్రీత్ బుమ్రా స్థానం కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇందులో మొదటి స్థానం షమీకి దక్కే అవకాశం ఉంది.

సెలక్టర్లు కూడా మహ్మద్ సిరాజ్‌పై..

ప్రస్తుతం రిజర్వ్ ఆటగాళ్లలో ఉన్న మహ్మద్ షమీ, దీపక్ చాహర్‌లు బుమ్రాకు బెస్ట్ రిప్లేస్ అని చెప్పవచ్చు. అయితే, ఆస్ట్రేలియా గడ్డపై మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కంగారూల గడ్డపై సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కాబట్టి అతను బుమ్రాకు ప్రత్యామ్నాయం కావచ్చు.

మరోవైపు గాయం నుంచి బయటపడిన దీపక్ చాహర్ దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన మహ్మద్ షమీ కూడా పెద్ద టోర్నీలు ఆడిన అనుభవం ఉండటంతో.. జట్టులోకి వచ్చే అవకాశాలు షమీకి కూడా ఉన్నాయి.

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయంతో దూరమైన తర్వాత.. బుమ్రా టోర్నమెంట్‌లో భారత్‌కు దూరమయ్యే రెండో ప్రధాన ఆటగాడు. టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 రౌండ్‌లో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో పాటు క్వాలిఫైయింగ్ రౌండ్‌లో ఉన్న రెండు జట్లతో గ్రూప్ 2లో టీమిండియా ఉంది.

భారత టీ20 ప్రపంచకప్ జట్టు :

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా*, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.

రిజర్వ్ ఆటగాళ్లు :

మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం