AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rafael Nadal: ఫ్యాన్స్‌ కి షాకిచ్చిన రఫెల్‌ నాదల్‌.. ఒలింపిక్స్‌, వింబుల్డన్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన!

రఫెల్ నాదల్ ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చాడు. ఈ ఏడాది జరిగే పలు పోటీల్లో పాల్గొనడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

Rafael Nadal: ఫ్యాన్స్‌ కి షాకిచ్చిన రఫెల్‌ నాదల్‌.. ఒలింపిక్స్‌, వింబుల్డన్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన!
Rafael Nadal
Venkata Chari
|

Updated on: Jun 17, 2021 | 6:34 PM

Share

Tokyo Olympics: రఫెల్ నాదల్ ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చాడు. ఈ ఏడాది జరిగే పలు పోటీల్లో పాల్గొనడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఒలింపిక్స్ లో అతని ఆటను ఆస్వాదిద్దామనుకున్న ఫ్యాన్స్‌ ఒకింత నిరాశకుగురవుతూ.. ఎందుకిలా చేశావంటూ కామెంట్లు పెడుతున్నారు. 20 సార్లు గ్రాండ్‌స్లామ్ లను సాధించాడు ఈ ఛాంపియన్. టోక్యో గేమ్స్, వింబుల్డన్ 2021 నుంచి వైదొలగబోతున్నట్లు ప్రకటించడం ఒకింత షాక్‌ కు గురిచేసిందని తోటి ఆటగాళ్లు కూడా కామెంట్లు చేశారు. తన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, అలాగే కెరీర్‌ను ఎక్కువకాలం కొనసాగించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నాడు. నాదల్ 2008, 2010 లో రెండుసార్లు వింబుల్డన్ గెలుచుకున్నాడు. అలాగే 2008 లో పురుషుల సింగిల్స్ టెన్నిస్‌లో ఒలింపిక్ స్వర్ణం సాధించాడు. ఈ నెల ప్రారంభంలో రోలాండ్ గారోస్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో నోవాక్ జొకోవిక్ చేతిలో పరాజయం పాలైయ్యాడు రాఫెల్ నాదల్. ఒలింపిక్ క్రీడలు తనకు ఎప్పుడూ ప్రత్యేకమైనవని, 3 ఒలింపిక్స్‌లో స్పెయిన్‌కు ప్రాతినిధ్యం వహించిన గౌరవం తనకు ఉందని నాదల్ పేర్కొన్నాడు.

కాగా, ట్విట్టర్లో ఇలా రాసుకొచ్చాడు… ” ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమానులకు, ముఖ్యంగా యూకే, జపాన్‌లో ఉన్న వారికి ప్రత్యేక సందేశం పంపాలని కోరుకుంటున్నాను. ఒలింపిక్ క్రీడలు ఎంతో ప్రాధాన్యం కలిగినవి. ప్రతీ క్రీడాకారుడు ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధించాలని ఎన్నో కలలు కంటారు. అలాగే ప్రతీ క్రీడాకారుడికి జీవించే హక్కు కూడా ఉంటుంది. నేను నా దేశ జెండాకు గౌరవం తెచ్చే వ్యక్తిగా ఎంతో బాధ్యతగా ఉంటాను” అని రాసుకొచ్చాడు.

అలాగే మరో ట్వీట్‌లో ” హాయ్, వింబుల్డన్‌లో ఈ ఏడాది జరిగే ఛాంపియన్‌షిప్‌లు, టోక్యోలో జరిగే ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాను. ఇది ఎప్పటికీ తేలికైన నిర్ణయం కాదు. కానీ, నాశరీరం సహకరించకపోవడంతో నా బృందంతో చర్చించిన తర్వాత ఇది సరైన నిర్ణయం అని నేను అర్థం చేసుకున్నాను” అని అసలు విషయం వెల్లడించారు రఫెల్ నాదల్. తన కెరీర్ కు ఈ దశలో విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం అని నాదల్ తెలిపాడు. 14 వ రోలాండ్ గారోస్ లో ట్రోఫీ కోసం పోరాడాడు. కానీ, సెమీ-ఫైనల్స్‌లో ఓడిపోయాడు. 35 ఏళ్ల నాదల్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో 3 వ మ్యాచ్‌లోనే ఓడి నిష్ర్కమించాడు.

Also Read:

WTC Finals: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. జట్టులో ఇద్దరు స్పిన్నర్లు.!

Tokyo Olympics: హాకీలో టాప్ 10 దేశాలు ఇవే.. ఈ టీంల ఆటను తప్పక చూడాల్సిందే!