Paris Paralympics 2024: మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది: పారాలింపిక్ విజేతలతో ప్రధాని మోదీ..

Paris Paralympics 2024: ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రూనై, సింగపూర్‌లలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. మంగళవారం విమానాశ్రయంలో బ్రూనై యువరాజు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధానికి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. భారత హైకమిషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి. దీని తర్వాత, ప్యారిస్ పారాలింపిక్స్ 2024లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Paris Paralympics 2024: మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది: పారాలింపిక్ విజేతలతో ప్రధాని మోదీ..
Pm Modi
Follow us
Venkata Chari

|

Updated on: Sep 04, 2024 | 7:10 AM

Paris Paralympics 2024: ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రూనై, సింగపూర్‌లలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. మంగళవారం విమానాశ్రయంలో బ్రూనై యువరాజు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధానికి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. భారత హైకమిషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి. దీని తర్వాత, ప్యారిస్ పారాలింపిక్స్ 2024లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా భారత పారాలింపిక్ క్రీడాకారులు యోగేష్ కథునియా, సుమిత్ ఆంటిల్, శీతల్ దేవి, రాకేష్ కుమార్‌లతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని ప్రధాని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పారాలింపిక్ విజేతలకు ఫోన్ చేసి వారితో మాట్లాడి అభినందించారు.

ఎక్కడ ఉన్నా.. నా ఆలోచనలన్ని భారత్‌పైనే: ప్రధాని

భారతదేశం తన క్రీడాకారులను చూసి గర్విస్తోందని ప్రధాని అన్నారు. యోగేష్‌తో మాట్లాడుతూ, అథ్లెట్ తల్లి పరిస్థితి గురించి సమాచారం తెలుసుకున్నారు. ఆమె గర్భాశయ వ్యాధిపై కూడా అప్‌డేట్ తెలుసుకున్నారు. ఆమెను ప్రశంసిస్తూ, మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడంలో ఎంతో కష్టపడిందని ప్రధాని అన్నారు. ఆ తర్వాత యోగేష్ మాట్లాడుతూ.. బ్రూనైలో ఉన్నా మా గురించి ఆరా తీసున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఇందుకు ధన్యవాదాలు సార్ అంటూ తెలిపాడు. దీనిపై ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ నేను ప్ర‌పంచంలో ఎక్కడ ఉన్నా భారతదేశంపైనే నా ఆలోచనలు ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చారు.

పారాలింపిక్ క్రీడాకారుల్లో పెరిగిన ఉత్సాహం..

ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ, పారిస్ పారాలింపిక్ క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తున్నారు. సోమవారం కూడా అవని లేఖతో మాట్లాడారు. అంతకుముందు, ప్రధానమంత్రి పారాలింపిక్ క్రీడాకారులందరితో మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయంలో అవని లేఖరా ఒక పోటీలో పాల్గొనడానికి వెళ్లింది. దీంతో ఆమె ఆ సమయంలో ప్రధానితో మాట్లాడలేకపోయింది. ఈ కారణంగా ప్రధాని ఆమెకు మరోసారి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

భారత్ ఖాతాలో 16 పతకాలు..

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 16 పతకాలు సాధించింది. పురుషుల డిస్కస్ త్రో F56 అథ్లెటిక్స్‌లో యోగేష్ కథునియా కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కాగా, జావెలిన్‌ త్రో ఎఫ్‌64లో సుమిత్‌, యాంటిల్‌ స్వర్ణ పతకం సాధించారు. మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ ఆర్చరీలో రాకేష్ కుమార్, శీతల్ దేవి రజత పతకం సాధించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..