కామన్వెల్త్‌లో కాంస్యం గెలిచాడు.. కట్‌చేస్తే.. 2 ఏళ్ల తర్వాత పాక్ ప్లేయర్‌పై నిషేధం.. పతకం వెనక్కి
Pakistani Wrestler Ali Asad Banned: క్రికెట్ లేదా మరే ఇతర క్రీడ అయినా, పాకిస్థానీ ఆటగాళ్ళు ఎల్లప్పుడూ తమ తప్పులతో వార్తల్లో నిలుస్తుంటారు. చాలా మంది పాకిస్తానీ ఆటగాళ్లు క్రికెట్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలింది. ఈ కారణంగా వారిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కొందరు క్రికెటర్లపై జీవితకాల నిషేధం విధించారు. ఇప్పుడు పాకిస్థాన్ క్రీడల్లో మరో ఆటగాడిపై నిషేధం విధించారు. అతని పేరు అలీ అసద్. బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో అతను రెజ్లింగ్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కానీ, ఇప్పుడు ఆ పతకాన్ని వెనక్కి తీసుకున్నారు.

పాకిస్థాన్ రెజ్లర్ అలీ అసద్‌పై నిషేధం..
నిజానికి అలీ అసద్ డోప్ టెస్ట్‌లో విఫలమయ్యాడు. ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అతన్ని పరీక్షించినప్పుడు, అతను తన పనితీరును పెంచడానికి మందులు తీసుకున్నట్లు తేలింది. ఆ తర్వాత, కేసు విచారణ జరగాల్సి ఉంది. కానీ, అసద్ అందులో పాల్గొనలేదు లేదా తనపై వచ్చిన ఆరోపణలకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఆ తరువాత అతని నుంచి పతకాన్ని తీసుకోవడమే కాకుండా, అతనిపై నాలుగేళ్ల నిషేధం కూడా విధించారు.
డోపింగ్ కారణంగా పాకిస్థాన్‌కు చెందిన పలువురు అథ్లెట్లు గతంలో నిషేధానికి గురయ్యారు. టోక్యో ఒలింపిక్స్ 2020 సందర్భంగా తల్హా తాలిబ్ వార్తల్లో నిలిచాడు. అతను టోక్యో ఒలింపిక్స్ సమయంలో వెయిట్ లిఫ్టింగ్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. ఆ సమయంలో పాకిస్తాన్‌లో చాలా ప్రసిద్ధి చెందిన అథ్లెట్. అయితే, తరువాత అతను డోపింగ్‌లో పాల్గొన్నట్లు తేలింది. అతనిపై నిషేధం కూడా విధించారు.
పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్ ..
CWG medalist Ali Asad returns positive dope test#ASportsHD #AliAsad #CWG22 #B2022https://t.co/kaLgcwhdE9
— ASports (@asportstvpk) September 23, 2022
పారిస్ ఒలింపిక్స్ 2024 సందర్భంగా భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ పతకాన్ని దక్కించుకోలేకపోయారు. వినేష్ ఫోగట్ 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే, 100 గ్రాముల అధిక బరువు కారణంగా, ఆమె అనర్హతకి గురైంది. ఆమె పతకాన్ని చేజార్చుకుంది. పారిస్ పారాలింపిక్స్‌లో ఇలాంటి ఘటనే మరొకటి కనిపించింది. ఈసారి ఆస్ట్రేలియన్ రన్నర్ కాంస్య పతకాన్ని కోల్పోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..