AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wimbledon 2025 : వింబుల్డన్‌లో పుష్ప రాజ్ మేనియా.. తగ్గేదేలే అంటున్న జకోవిచ్

వింబుల్డన్ 2025 టోర్నమెంట్‌లో నొవాక్ జకోవిచ్ పుష్ప లుక్‌తో ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. తగ్గేదేలే మేనరిజంతో జకోవిచ్ 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నాడో ఫోటోతో చూపించారు. జకోవిచ్ తన మొదటి మ్యాచ్లో ఘన విజయం సాధించాడు.

Wimbledon 2025 : వింబుల్డన్‌లో పుష్ప రాజ్ మేనియా.. తగ్గేదేలే అంటున్న జకోవిచ్
Novak Djokovic
Rakesh
|

Updated on: Jul 02, 2025 | 9:17 PM

Share

Wimbledon 2025 : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ 2025 సందడి మొదలైంది. ఈసారి టోర్నీ నిర్వాహకులు ఒక వెరైటీ స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. నోవాక్ జకోవిచ్ తన రికార్డు 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ప్రయత్నిస్తుండగా, అతని పట్టుదలను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని తగ్గేదేలే మేనరిజంతో పోల్చారు. వింబుల్డన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో జకోవిచ్ పుష్ప లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. గతేడాది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని తగ్గేదేలే మేనరిజం ఇప్పుడు దేశవిదేశాల్లో పాపులర్ అవుతోంది. తాజాగా వింబుల్డన్ టోర్నమెంట్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పుష్ప లుక్‌లో ఉన్న జకోవిచ్ ఫోటోను పోస్ట్ చేసింది.

జకోవిచ్ తన తొలి మ్యాచ్‌ను జూలై 1న ఫ్రెంచ్ ఆటగాడు అలెగ్జాండర్ ముల్లర్‌తో ఆడాడు. ఈ మ్యాచ్‌కు ముందు వింబుల్డన్ అఫీషియల్ అకౌంట్‌లో జకోవిచ్ తగ్గేదేలే పోజ్‌లో ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌పై జకొవిక్ అని తెలుగులో రాసి ఉండటం విశేషం. అంతేకాదు, తగ్గేదేలే లేదు, ఆగేదే లేదు అనే క్యాప్షన్‌ను కూడా ఇచ్చారు. దీనితో తెలుగు అభిమానులు కామెంట్ బాక్స్‌లను ఇది మన తెలుగు సినిమా రేంజ్ అంటూ నింపేశారు. ఒక ప్రముఖ క్రీడా సంస్థ తన సోషల్ మీడియాలో తెలుగులో పోస్ట్ పెట్టడం నిజంగా అరుదైన విషయం.

యూఎస్ ఓపెన్ 2023 తర్వాత జకోవిచ్ ఏ గ్రాండ్‌స్లామ్ గెలవలేదు. ఏడుసార్లు వింబుల్డన్ గెలిచిన జకోవిచ్ ఈసారి తన రికార్డు 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. వింబుల్డన్ నిర్వాహకులు కూడా అతని పట్టుదలను తగ్గేదేలే అనే పుష్ప డైలాగ్‌తో పోల్చారు.

View this post on Instagram

A post shared by Wimbledon (@wimbledon)

జకోవిచ్‌ వయసు ప్రస్తుతం 38 ఏళ్లు. గత రెండు వింబుల్డన్ ఫైనల్స్‌లో అతను కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓడిపోయాడు. తన ప్రస్తుత ఫామ్ కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించేందుకు అతను తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్‌లో జానిక్ సిన్నర్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ, వింబుల్డన్‌లో జకొవిచ్ ఎలా రాణిస్తాడో చూడాలి.

పుష్ప మేనరిజం సినిమా సెలబ్రిటీలు, క్రికెటర్లలో కూడా బాగా పాపులర్ అయింది. గతంలో రవీంద్ర జడేజా, డేవిడ్ వార్నర్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి ప్లేయర్లు గతంలో మైదానంలో ఈ మేనరిజాన్ని ప్రదర్శించారు. ఇటీవల పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ కూడా వికెట్ తీసిన తర్వాత తగ్గేదేలే స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు. జకోవిచ్ తన తొలి మ్యాచ్‌లో ముల్లర్‌పై 6-1, 6-7, 6-2, 6-2 తేడాతో విజయం సాధించాడు. ఈ విజయంతో తను టైటిల్ వేటను ఘనంగా ప్రారంభించాడు. గురువారం అతను ఈవాన్తో రెండో మ్యాచ్ ఆడనున్నాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..