IPBL 2023: ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో సంచలనం.. డిసెంబర్ 16 నుంచి హైదరాబాద్‌లో ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్..
డబ్ల్యూబీసీ, డబ్ల్యూబీఏ, డబ్ల్యూబీఓ వంటి దిగ్గజాల నుంచి అంతర్జాతీయ అనుబంధాలతో తెలంగాణ బాక్సర్లు ప్రపంచ గుర్తింపు పొందుతూ దూసుకుపోతున్నారు. ఈ మేరకు ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (IBC) ప్రెసిడెంట్ బ్రిగేడియర్ పీకేఎం రాజా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. “ భారతదేశంలోనే మొదటి రాష్ట్ర ప్రో బాక్సింగ్ కౌన్సిల్‌లో తెలంగాణ అగ్రగామిగా నిలిచినందుకు నేను సంతోషిస్తున్నాను అంటూ తెలిపాడు.
Indian Pro Boxing League 2023: భారతదేశంలో ప్రొఫెషనల్ బాక్సింగ్ క్రీడలో ఒక సంచలనాత్మకంగా నిలిచిన ఇండియన ప్రో బాక్సింగ్ లీగ్ డిసెంబర్ 16 నుంచి ప్రారంభంకానుంది. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్ర ప్రో బాక్సింగ్ కౌన్సిల్, తెలంగాణ బాక్సింగ్ కౌన్సిల్ (TBC) అధికారికంగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ లీగ్ ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (IBC), నేషనల్ కమీషన్ ఫర్ ప్రొఫెషనల్ బాక్సింగ్ ఇన్ ఇండియా అధికారికంగా గుర్తించింది.
ఈ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో మరో మూడు రోజుల్లో మొదలుకానున్నాయి. “ రోడ్ టు ది ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్ ” అనే గ్రాండ్ ప్రో బాక్సింగ్ ఫైట్ నైట్ ఈవెంట్‌ను ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ అసాధారణ ఈవెంట్ జిల్లా స్థాయి పోటీలు, మహిళల విభాగంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జాతీయ టైటిల్ పోరుతో సహా పలు స్థాయిల పోటీల్లో అపూర్వమైన 10 ప్రో బౌట్‌లను ప్రదర్శిస్తుంది. అదనంగా, ఇది అగ్రశ్రేణి భారతీయ ప్రో బాక్సర్ శబరి జెతో అంతర్జాతీయ 10-రౌండ్ పోటీని కలిగి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలో క్రీడారంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.
🎟️Secure your ringside seat for the new era of Indian Boxing!
🥊 Road to IPBL Tickets are available now on @bookmyshow
🤝Join us on December 16th, 4:00 PM, in Hyderabad, for an unforgettable experience.
🤩Don’t miss out on the action – grab your tickets today!#boxing #ipbl pic.twitter.com/NANkCyyGzT
— Indian Pro Boxing League (@IPBLBoxing) November 30, 2023
డబ్ల్యూబీసీ, డబ్ల్యూబీఏ, డబ్ల్యూబీఓ వంటి దిగ్గజాల నుంచి అంతర్జాతీయ అనుబంధాలతో తెలంగాణ బాక్సర్లు ప్రపంచ గుర్తింపు పొందుతూ దూసుకుపోతున్నారు. ఈ మేరకు ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (IBC) ప్రెసిడెంట్ బ్రిగేడియర్ పీకేఎం రాజా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. “ భారతదేశంలోనే మొదటి రాష్ట్ర ప్రో బాక్సింగ్ కౌన్సిల్‌లో తెలంగాణ అగ్రగామిగా నిలిచినందుకు నేను సంతోషిస్తున్నాను. గత రెండు నెలలుగా, మేం ఇప్పటికే తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 15 జిల్లాలను అనుబంధించాం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో 33 జిల్లాలకు దీన్ని విస్తరించాలని చూస్తున్నాం’ అంటూ ప్రకటించాడు.
IPBL ఈవెంట్ షెడ్యూల్..
ప్రారంభ వేడుక సాయంత్రం 4:00 – 4:30గంటల వరకు
తెలంగాణ గ్రాస్‌రూట్ బాక్సింగ్ బౌట్స్ సాయంత్రం 4:30 – 6:00 గంటల వరకు
ఇంటర్ సిటీ ఫైట్స్ – IPBL గ్లింప్స్ సాయంత్రం 6:00 – 7:30గంటల వరకు
IPBL ప్రారంభ వేడుక రాత్రి 7:30 – 8:00గంటల వరకు
WBC టైటిల్ ఫైట్స్ రాత్రి 8:00 – 10:00గంటల వరకు
టిక్కెట్లు..
View this post on Instagram
ఈ మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోవచ్చు. మ్యాచ్‌లు డిసెంబర్ 16 నుంచి మొదలుకానున్నాయి. సాయంత్రం 4 నుంచి మ్యాచ్‌లు జరగనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..