Gukesh D: చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా 18 ఏళ్ల భారత ఆటగాడు.. విశ్వనాథ్ ఆనంద్ సరసన గుకేష్

World Chess Champion: ప్రపంచ ఛాంపియన్‌షిప్ చివరి రౌండ్‌ వరకు చేరింది. చివరి గేమ్‌లో నిర్ణయాత్మక విజయాన్ని నమోదు చేసిన చెన్నైకి చెందిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ డి గుకేశ్.. చైనా దిగ్గజంపై విజయం సాధించాడు. దీంతో విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన రెండో భారత గ్రాండ్‌మాస్టర్‌గా గుకేశ్ నిలిచాడు.

Gukesh D: చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా 18 ఏళ్ల భారత ఆటగాడు.. విశ్వనాథ్ ఆనంద్ సరసన గుకేష్
Gukesh D
Follow us
Venkata Chari

|

Updated on: Dec 13, 2024 | 6:46 AM

Gukesh D World Chess Champion: సింగపూర్‌లో గురువారం జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను 18 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ డి గుకేశ్ గెలుచుకున్నాడు. అతను ఫైనల్‌లో చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను 7.5–6.5తో ఓడించాడు. ప్రపంచంలోనే ఇంత చిన్న వయసులో టైటిల్‌ గెలిచిన తొలి ఆటగాడిగా గుకేశ్‌ నిలిచాడు. అంతకుముందు 1985లో రష్యాకు చెందిన గ్యారీ కాస్పరోవ్ 22 ఏళ్ల వయసులో ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

14వ గేమ్‌లో చైనా ఆటగాడిని ఓడించి గుకేశ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ నవంబర్ 25న ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 11 వరకు ఇద్దరి మధ్య 13 గేమ్‌లు జరిగాయి. ఇక్కడ స్కోరు 6.5-6.5తో సమమైంది. ఈరోజు జరిగిన 14వ గేమ్‌లో గుకేశ్ గెలిచి ఒక పాయింట్‌తో ఆధిక్యంలోకి వెళ్లి స్కోరును 7.5-6.5తో చేశాడు.

ఇవి కూడా చదవండి

11వ గేమ్‌ను గెలుచుకున్న గుకేశ్..

ఆదివారం వరకు 11 గేమ్‌ల తర్వాత గుకేశ్ 6-5తో ఆధిక్యంలో ఉన్నాడు. 11 గేమ్‌లలో 8 డ్రా కాగా, గుకేష్ 2, లిరెన్ 1 గెలిచారు. లిరెన్ తిరిగి వచ్చి 12వ గేమ్‌ను గెలిచి మళ్లీ స్కోరును సమం చేశాడు. బుధవారం 13వ గేమ్‌లో 68 ఎత్తుగడల తర్వాత గుకేశ్ గేమ్‌ను డ్రా చేసుకోవలసి వచ్చింది. తర్వాత స్కోరు 6.5-6.5తో సమమైంది. 3, 11, 14వ గేమ్‌లలో గుకేశ్‌ విజయం సాధించాడు. లిరెన్ మొదటి, 12వ గేమ్‌లను గెలుచుకుంది. మిగిలిన గేమ్‌లు డ్రా అయ్యాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..