AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thomas Cup 2022: చరిత్ర సృష్టించిన భారత్.. 43 ఏళ్ల నిరీక్షణకు తెర..

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన మలేషియాపై విజయం కోసం భారత్‌ను పోటీదారుగా పరిగణించలేదు. భారత్ ఆరంభం బాగాలేకపోయినా ఆ తర్వాత పునరాగమనం చేసింది. అంతకుముందు భారత్ చివరి రెండు మ్యాచ్‌ల్లో క్లీన్ స్వీప్ చేసి విజయం సాధించింది.

Thomas Cup 2022: చరిత్ర సృష్టించిన భారత్.. 43 ఏళ్ల నిరీక్షణకు తెర..
Thomas Cup 2022 Kidmabi Srikanth
Venkata Chari
|

Updated on: May 13, 2022 | 6:41 AM

Share

గురువారం థామస్ కప్‌లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు(Indian Badminton Team) చరిత్ర సృష్టించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో మలేషియాను 3-2తో ఓడించిన భారత్ 43 ఏళ్ల నిరీక్షణ తర్వాత బీడబ్య్లూఎఫ్ థామస్ కప్‌(BWF Thomas Cup)లో దేశానికి పతకం దక్కింది. ఈ విజయంతో ఆ జట్టు కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. అయితే ఉబర్ కప్‌(Uber Cup)లో భారత మహిళల జట్టు నిరాశపరిచింది. థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో మహిళల జట్టు 0-3 తేడాతో ఓటమి పాలైంది. ప్రస్తుతం టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Also Read: 7 బంతుల్లో 34 పరుగులు.. 29 బంతుల్లో గేమ్ ఓవర్.. టీ20 మ్యాచ్‌లో మరో ప్రభంజనం..!

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన మలేషియాపై విజయం కోసం భారత్‌ను పోటీదారుగా పరిగణించలేదు. భారత్ ఆరంభం బాగాలేకపోయినా ఆ తర్వాత పునరాగమనం చేసింది. అంతకుముందు భారత్ చివరి రెండు మ్యాచ్‌ల్లో క్లీన్ స్వీప్ చేసి విజయం సాధించింది. మలేషియాపై భారత్‌ శుభారంభం చేయలేదు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 46 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో లక్ష్య 21-239-21తో ప్రపంచ ఛాంపియన్ లీ జీ జియా చేతిలో ఓడిపోయాడు. అయితే ఇక్కడ నుంచి పునరాగమనం చేసిన భారత్.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

సాత్విక్ – చిరాగ్ విజయం..

ఇవి కూడా చదవండి

రెండో మ్యాచ్‌లో చిరాగ్‌, సాత్విక్‌ సాయిరాజ్‌ జంట 21-19 21-15తో నూర్‌ 13వ నూర్‌ గోహ్‌ సే ఫైపై విజయం సాధించింది. దీని తర్వాత జరిగిన రెండో సింగిల్స్ మ్యాచ్‌లో శ్రీకాంత్ విజయం సాధించాడు. శ్రీకాంత్ 21-11 21-17తో వరుస గేమ్‌లలో ప్రపంచ 46వ ర్యాంకర్ ఎన్‌జీ టీజే యోంగ్‌ను ఓడించాడు. ప్రపంచ ర్యాంకింగ్ 45వ ర్యాంక్ జంట కృష్ణ ప్రసాద్ గరగా, విష్ణువర్ధన్ గౌర్ పంజాల ఆరోన్ చియా, టియో యీ చేతిలో ఓడిపోయారు.

ప్రణయ్ జట్టు కూడా..

ప్రపంచ ర్యాంకింగ్ 23వ ర్యాంక్ ఆటగాడు ప్రణయ్ విజయంతో భారత్ తదుపరి రౌండ్‌లో చోటు దక్కించుకుంది. ప్రణయ్ ప్రారంభంలో 1-6తో వెనుకబడి ఉన్నాడు. కానీ, అతను 21-13, 2108తో 22 ఏళ్ల హున్ హావో లియోంగ్‌ను ఓడించి భారత విజయాన్ని ఖాయం చేశాడు. ప్రస్తుతం సెమీస్‌లో దక్షిణ కొరియా, డెన్మార్క్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో భారత్ తలపడనుంది.

సింధు ఓటమి..

గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-3 తేడాతో ఓడి ఉబెర్‌తో నిష్క్రమించింది. ఇక్కడి ఇంపాక్ట్ ఎరీనా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ పీవీ సింధు భారత్‌కు విజయాన్నందించలేకపోయింది. సింధు 21-18, 17-21, 12-21 తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన రచ్చనోక్ ఇంటనాన్ చేతిలో ఓడిపోయింది.

మరిన్ని ఐపీఎల్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022: ముంబై దెబ్బకు ఆ చెత్త రికార్డులో చేరిన చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్‌లో రెండోసారి..

CSK vs MI: ముంబై ఇండియన్స్‌ సూపర్ విక్టరీ.. చెన్నై ప్లే ఆఫ్‌ ఆశలు గల్లంతు..