Fifa World Cup 2022: ఫిఫాలో ఓటమిపై ఆగ్రహించిన అభిమానులు.. ఫ్రాన్స్‌లో చేలరేగిన అల్లర్లు..

పారిస్‌తో పాటు, ఈ హింస అనేక ఇతర నగరాలకు వ్యాపించింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. పారిస్‌లో వేలాది మంది పోలీసులను మోహరించారు.

Fifa World Cup 2022: ఫిఫాలో ఓటమిపై ఆగ్రహించిన అభిమానులు.. ఫ్రాన్స్‌లో చేలరేగిన అల్లర్లు..
Fifa World Cup 2022 France
Follow us

|

Updated on: Dec 19, 2022 | 10:22 AM

France vs Argentina: ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిపోవడంతో ఫ్రాన్స్ అభిమానులు ఆగ్రహానికి లోనయ్యారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో వేలాది మంది అభిమానులు అల్లర్లు ప్రారంభించారు. వాహనాలను ధ్వంసం చేసి దహనం చేశారు. పారిస్‌తో పాటు, ఈ హింస అనేక ఇతర నగరాలకు వ్యాపించింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. పారిస్‌లో వేలాది మంది పోలీసులను మోహరించారు. నైస్‌లోని లియోన్‌లో కూడా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. పారిస్‌లోని ప్రసిద్ధ చాంప్స్ ఎలిసీస్‌లో కూడా అభిమానులు ఒకరితో ఒకరు గొడవపడ్డారు.

వాటర్‌కెనన్లు, బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు..

ఫ్రాన్స్ విజయాన్ని చూసేందుకు లక్షలాది మంది అభిమానులు ఫ్రెంచ్ నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడారని అధికారి తెలిపారు. అయితే అర్జెంటీనా చేతిలో 4-2 తేడాతో ఓడిపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. 14,000 మంది పోలీసులను మోహరించారు. పోలీసులతో కూడా అభిమానులు వాగ్వాదానికి దిగారు. చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని నియంత్రించేందుకు పలుచోట్ల వాటర్‌ కెనాన్‌లను కూడా ప్రయోగించారు.

ఉద్వేగానికి లోనైన ఆటగాళ్లను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ శాంతించాలని కోరారు.ఫైనల్ లో ఓటమి తర్వాత ఫ్రాన్స్ ఆటగాళ్లు ఉద్వేగానికి లోనయ్యారు. ఫ్రెంచ్ ఆటగాళ్లను కలిసేందుకు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మైదానానికి చేరుకున్నారు. నిరాశ చెందిన ఆటగాళ్లను ఓదార్చాడు. ఫ్రాన్స్ స్ట్రైకర్ కైలియన్ ఎంబాప్పేకి మాక్రాన్ వివరించాడు. ఎంబాప్పే ఫ్రాన్స్ తరపున ఫైనల్‌లో హ్యాట్రిక్ సాధించాడు. అయితే అతను జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

అర్జెంటీనాకు శుభాకాంక్షలు తెలిపిన మాక్రాన్..

ఫ్రాన్స్ ఓటమి తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ట్వీట్ చేశారు. ‘ఈ ప్రపంచ కప్‌లో వారి కెరీర్, పోరాట స్ఫూర్తికి ఫ్రెంచ్ జట్టుకు అభినందనలు. మీరు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మద్దతుదారులను ఉత్తేజపరిచారు. అదే సమయంలో అర్జెంటీనా విజయం సాధించినందుకు అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు.

ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా 36 ఏళ్ల తర్వాత ఫిఫా ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ప్రపంచ ఛాంపియన్ కావాలన్న లియోనెల్ మెస్సీ కల నెరవేరింది. మ్యాచ్‌లో నిర్ణీత 90 నిమిషాలు, 30 నిమిషాల అదనపు సమయం, ఆపై పెనాల్టీ షూటౌట్‌తో కలిపి మొత్తం 12 గోల్స్ నమోదయ్యాయి. అదనపు సమయం వరకు ఇరు జట్లు 3-3తో సమంగా నిలిచాయి. పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4–2తో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..