2010లో పాల్ ది ఆక్టోపస్.. 2022లో తైయో.. నిజమవుతోన్న ఈ జంతువుల అంచనాలు.. ఫిఫా 2023లో విజేత ఎవరంటే?
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్-2010లో పాల్ అనే ఆక్టోపస్ వేసిన అంచనాలు నిజమయ్యాయి. ఈసారి కూడా ఇలాంటి అంచనాలు వేసే జంతువుల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
FIFA World Cup 2023 Winner: ఫిఫా ప్రపంచకప్ వచ్చిందంటే ప్రతి ఒక్కరి మదిలో ఓ జంతువు పేరు మెదులుతుంది. దాని పేరు పాల్ ఆక్టోపస్. 2010లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ సమయంలో ఈ సముద్ర జంతువు కొన్ని మ్యాచ్‌ల గురించి అంచనాలు వేసింది. అవి నిజమయ్యాయి. ఈ జంతువు ముందు రెండు పెట్టెలు ఉంచారు. ఈ ఆక్టోపస్ పట్టుకున్న బాక్స్‌పై ఉన్న జట్టును విజేతగా పరిగణించారు. చాలా మ్యాచ్‌ల్లో ఇదే జరిగింది. పాల్ ఈ పనిని యూరో-2008, ఫిఫా వరల్డ్ కప్-2010లో చేసి, ఆకట్టుకుంది. ఈసారి కూడా అందరి కళ్ళు ఇలాంటి జంతువు కోసం వెతుకుతున్నాయి. తాజాగా ఖతార్‌లో జరుగుతున్న ప్రపంచ కప్ -2022 గురించి కూడా అంచనాలు వస్తున్నాయి.
పాల్ యూరో-2008లో ఆరు మ్యాచ్‌ల గురించి చెప్పుకొచ్చింది. అందులో నాలుగు అంచనాలు నిజమయ్యాయి. 2010 ప్రపంచకప్‌లో పాల్ చెప్పిన ఎనిమిది అంచనాలు నిజమయ్యాయి. సెమీ-ఫైనల్‌లో జర్మనీపై స్పెయిన్ విజయం సాధిస్తుందని పాల్ ఊహించింది. అది నిజమైంది. ఫైనల్‌లో కూడా దాని అంచనా నిజమై స్పెయిన్ నెదర్లాండ్స్‌ను ఓడించింది. పాల్ అక్టోబర్ 2010లో మరణించింది.
2022లో అంచనాలు ఎలా ఉన్నాయి?
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈసారి ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్-2022 విజేతపై ఏ జంతువులు అలాంటి అంచనాలు వేస్తున్నాయా? అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. నవంబర్ 26న స్పోర్ట్ స్టార్ రిపోర్ట్ ప్రకారం, కొన్ని జంతువులు ఇప్పటికే కొన్ని అంచనాలు వేశాయి. రౌండ్-16 మ్యాచ్‌లో క్రొయేషియా జట్టు జపాన్‌ను ఓడిస్తుందని జపాన్‌లో కెంట్ అనే బబూన్ పేర్కొంది. అదే జరిగింది. క్రొయేషియా, జపాన్ మధ్య జరిగిన మ్యాచ్ నిర్ణీత సమయంలో 1-1తో ముగియగా, పెనాల్టీ షూటౌట్‌లో క్రొయేషియా 3-1తో జపాన్‌ను ఓడించింది. ప్రముఖ వీడియో గేమ్‌ల ఫ్రాంచైజీ EA స్పోర్ట్స్, ఫిఫా 2023 ఈసారి ఫైనల్‌లో నెయ్‌మార్ బ్రెజిల్‌పై మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా విజేతగా ఉంటుందని అంచనా వేసింది.
జపాన్‌లో ఉన్న దీని పేరు తైయో. గ్రూప్ దశలో జపాన్ జట్టు జర్మనీని ఓడిస్తుందని ఈ జంతువు చెప్పింది. ఇదే జరిగింది. గ్రూప్-ఇ మ్యాచ్‌లో జపాన్ 2-1తో జర్మనీని ఓడించింది. ఈ ప్రపంచకప్‌లో జరిగిన అతిపెద్ద అప్‌సెట్లలో ఇదొకటిగా నిలిచింది.
2018లో పిల్లి అంచనాలు నిజమయ్యాయి. 2010 నుంచి ప్రతిసారి ప్రపంచకప్‌లో ఇలాంటి వార్తలు వస్తున్నాయి. 2018లో రష్యా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. రష్యాలోని ఓ పిల్లి కూడా ఇదే కారణంతో చర్చలోకి వచ్చింది. ఈ పిల్లి పేరు అకిలెస్. ఈ పిల్లి వేసిన కొన్ని అంచనాలు తప్పు అయ్యాయి. రష్యా ప్రపంచకప్ గెలుస్తుందని ఈ పిల్లి జోస్యం చెప్పింది కానీ అలా జరగలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..