Asian Games 2023: COVID-19 కారణంగా వాయిదా పడిన తర్వాత 19వ ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్‌జౌలో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనున్నాయి. హాంగ్‌జౌతోపాటు ఐదు నగరాల్లోని 54 పోటీ వేదికల్లో మొత్తం 40 క్రీడలు, 61 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. కాగా, ఆసియా క్రీడలు 2023లో చాలా ఈవెంట్‌లు సెప్టెంబర్ 23న ప్రారంభ వేడుక తర్వాత ప్రారంభం కానున్నాయి.
అయితే, క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, బీచ్ వాలీబాల్ వంటి కొన్ని పోటీలు ప్రారంభానికి ముందే అంటే సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి.
విలువిద్య, ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, బాక్సింగ్, బ్రేకింగ్, హాకీ, మోడరన్ పెంటాథ్లాన్, సెయిలింగ్, టెన్నిస్, వాటర్ పోలో వంటి తొమ్మిది క్రీడలకు 74 పారిస్ ఒలింపిక్స్ కోటాలు ఉంటాయి.
ఆసియా ఖండం నుంచి పోటీపడే దేశాల్లో భారత్-పాకిస్తాన్, చైనా-జపాన్ మధ్య తీవ్రమైన పోటీలు ఆసక్తిగా మారనున్నాయి. బహుళ-క్రీడా మహోత్సవంలో భారతదేశానికి చెందిన నీరజ్ చోప్రా, ఖతార్‌కు చెందిన ముతాజ్ బర్షిమ్, చైనాకు చెందిన జాంగ్ యుఫీ, లీ బింగ్‌జీలతో స్టార్ ప్లేయర్లు సందడి చేయనున్నారు.
ముగింపు వేడుకలు అక్టోబర్ 8న జరగనున్నాయి.
ఈవెంట్ | తేదీ |
ప్రారంభ వేడుక | 23 సెప్టెంబర్ |
ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ | 6-8 అక్టోబర్ |
డైవింగ్ | 30 సెప్టెంబర్-4 అక్టోబర్ |
మారథాన్ స్విమ్మింగ్ | 6-7 అక్టోబర్ |
ఈత | 24-29 సెప్టెంబర్ |
వాటర్ పోలో | 25 సెప్టెంబర్-7 అక్టోబర్ |
విలువిద్య | 1-7 అక్టోబర్ |
వ్యాయామ క్రీడలు | 29 సెప్టెంబర్-5 అక్టోబర్ |
బ్యాడ్మింటన్ | 28 సెప్టెంబర్-7 అక్టోబర్ |
బేస్బాల్ | 26 సెప్టెంబర్-7 అక్టోబర్ |
సాఫ్ట్ బాల్ | 26 సెప్టెంబర్-2 అక్టోబర్ |
బాస్కెట్‌బాల్ 3×3 | 25 సెప్టెంబర్-1 అక్టోబర్ |
బాస్కెట్‌బాల్ | 26 సెప్టెంబర్-6 అక్టోబర్ |
బాక్సింగ్ | 24 సెప్టెంబర్-5 అక్టోబర్ |
బ్రేకింగ్ | 6-7 అక్టోబర్ |
పడవ/కయాక్ (స్లాలోమ్) | 5-7 అక్టోబర్ |
కానో/కయాక్ (స్ప్రింట్) | 30 సెప్టెంబర్-3 అక్టోబర్ |
క్రికెట్ | 19–25 సెప్టెంబర్ (మహిళలు, 27 సెప్టెంబర్–7 అక్టోబర్ (పురుషులు) |
సైక్లింగ్ (BMX రేసింగ్) | 1 అక్టోబర్ |
సైక్లింగ్ (మౌంటైన్ బైక్) | 25 సెప్టెంబర్ |
సైక్లింగ్ (రోడ్డు) | 3-5 అక్టోబర్ |
సైక్లింగ్ (ట్రాక్) | 26-29 సెప్టెంబర్ |
ఈక్వెస్ట్రైన్ | 4-6 అక్టోబర్ |
గుర్రపుస్వారీ | 26 సెప్టెంబర్-6 అక్టోబర్ |
ఫెన్సింగ్ | 24-29 సెప్టెంబర్ |
ఫుట్బాల్ | 19 సెప్టెంబర్-7 అక్టోబర్ |
గోల్ఫ్ | 28 సెప్టెంబర్-1 అక్టోబర్ |
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ | 24-29 సెప్టెంబర్ |
రిథమిక్ జిమ్నాస్టిక్స్ | 6-7 అక్టోబర్ |
ట్రామ్పోలిన్ జిమ్నాస్టిక్స్ | 2-3 అక్టోబర్ |
హ్యాండ్‌బాల్ | 24 సెప్టెంబర్-5 అక్టోబర్ |
హాకీ | 24 సెప్టెంబర్-7 అక్టోబర్ |
జూడో | 24-27 సెప్టెంబర్ |
కబడ్డీ | 2-7 అక్టోబర్ |
జు-జిట్సు | 5-7 అక్టోబర్ |
కరాటే | 5-8 అక్టోబర్ |
కురాష్ | 30 సెప్టెంబర్-2 అక్టోబర్ |
బ్రిడ్జ్ | 27 సెప్టెంబర్-6 అక్టోబర్ |
చదరంగం | 24 సెప్టెంబర్-7 అక్టోబర్ |
ఎస్పోర్ట్స్ | 24 సెప్టెంబర్-2 అక్టోబర్ |
గో | 24 సెప్టెంబర్-3 అక్టోబర్ |
జియాంగ్కీ | 28 సెప్టెంబర్-7 అక్టోబర్ |
మోడ్రన్ పెంటాథ్లాన్ | 20-24 సెప్టెంబర్ |
రోలర్ స్కేటింగ్ | 30 సెప్టెంబర్-7 అక్టోబర్ |
స్కేట్‌బోర్డింగ్ | 24-27 సెప్టెంబర్ |
రోయింగ్ | 20-25 సెప్టెంబర్ |
రగ్బీ సెవెన్స్ | 24-26 సెప్టెంబర్ |
సెయిలింగ్ | 21-27 సెప్టెంబర్ |
సెపక్టక్రా | 24 సెప్టెంబర్-7 అక్టోబర్ |
షూటింగ్ | 24 సెప్టెంబర్-1 అక్టోబర్ |
సాఫ్ట్ టెన్నిస్ | 3-7 అక్టోబర్ |
స్పోర్ట్ క్లైంబింగ్ | 3-7 అక్టోబర్ |
స్క్వాష్ | 26 సెప్టెంబర్-5 అక్టోబర్ |
టేబుల్ టెన్నిస్ | 22 సెప్టెంబర్-2 అక్టోబర్ |
టైక్వాండో | 24-28 సెప్టెంబర్ |
టెన్నిస్ | 24-30 సెప్టెంబర్ |
ట్రయాథ్లాన్ | 29 సెప్టెంబర్-2 అక్టోబర్ |
బీచ్ వాలీ బాల్ | 19-28 సెప్టెంబర్ |
వాలీబాల్ | 19–26 సెప్టెంబర్ (పురుషులు) మరియు 30 సెప్టెంబర్–7 అక్టోబర్ (మహిళలు) |
వెయిట్ లిఫ్టింగ్ | 30 సెప్టెంబర్-7 అక్టోబర్ |
రెజ్లింగ్ | 4-7 అక్టోబర్ |
వుషు | 24-28 సెప్టెంబర్ |
ముగింపు వేడుక | 8 అక్టోబర్ |
భారతదేశంలో 19వ ఆసియా క్రీడల ప్రత్యక్ష ప్రసారం సోనీ LIV (సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్)లో చూడొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..