టార్గెట్ 2023… విండీస్ టూర్‌కు భారత్ జట్టు ఎంపిక!
ముంబై: విండీస్‌కు పర్యటించే భారత్ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఆగష్టు 3 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్‌లో భారత్ 2 టెస్టులు, 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. మూడు ఫార్మాట్లలలోనూ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కొనసాగనున్నాడు. ప్రపంచకప్ జట్టులో ఉన్న సభ్యులతో పాటు కొంతమంది కొత్త ముఖాలకు కూడా సెలెక్టర్లు చోటు కల్పించారు. అటు పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు టీ20, వన్డేలకు రెస్ట్ ఇచ్చి.. టెస్టులకు ఎంపిక చేశారు. టెస్టు జట్టు: […]
ముంబై: విండీస్‌కు పర్యటించే భారత్ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఆగష్టు 3 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్‌లో భారత్ 2 టెస్టులు, 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. మూడు ఫార్మాట్లలలోనూ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కొనసాగనున్నాడు. ప్రపంచకప్ జట్టులో ఉన్న సభ్యులతో పాటు కొంతమంది కొత్త ముఖాలకు కూడా సెలెక్టర్లు చోటు కల్పించారు. అటు పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు టీ20, వన్డేలకు రెస్ట్ ఇచ్చి.. టెస్టులకు ఎంపిక చేశారు.
టెస్టు జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానె(వైస్‌కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, పుజారా, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్
టీ20 జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కృనాల్ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవ్‌దీప్ సైనీ
వన్డే జట్టు:
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, కేదార్ జాదవ్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నవ్‌దీప్ సైనీ