AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అట్టహాసంగా జాతీయ పురస్కారాల ప్రధానోత్సవం

రాష్ట్రపతి భవన్‌లో క్రీడా పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారాలు ప్రధానం చేశారు. పారా అథ్లెట్ దీపా మాలిక్ కు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం, కబడ్డీ కోచ్ రాంబీర్ సింగ్ ఖోఖార్ కు ద్రోణాచార్య పురస్కారం, సోనియా లాటర్, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్, షట్లర్ సాయిప్రణీత్ కు అర్జున పురస్కారాలు ప్రధానం చేశారు. కాగా, అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్నఅవార్డు గ్రహీత రెజ్లర్‌ బజరంగ్‌ […]

అట్టహాసంగా జాతీయ పురస్కారాల ప్రధానోత్సవం
Pardhasaradhi Peri
|

Updated on: Aug 29, 2019 | 6:38 PM

Share

రాష్ట్రపతి భవన్‌లో క్రీడా పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారాలు ప్రధానం చేశారు. పారా అథ్లెట్ దీపా మాలిక్ కు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం, కబడ్డీ కోచ్ రాంబీర్ సింగ్ ఖోఖార్ కు ద్రోణాచార్య పురస్కారం, సోనియా లాటర్, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్, షట్లర్ సాయిప్రణీత్ కు అర్జున పురస్కారాలు ప్రధానం చేశారు. కాగా, అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్నఅవార్డు గ్రహీత రెజ్లర్‌ బజరంగ్‌ పునియా , షూటర్‌ అంజుమ్‌ మౌద్గిల్‌ రియోడి కార్యక్రమానికి గైర్హజరయ్యారు. పునియా ప్రస్తుతం రష్యాలో ఉన్నారు. రాబోయే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అతను సిద్ధమవుతున్నారు. క్రికెటర్‌ రవీంద్ర జడేజా కూడా వెస్టిండీస్‌లో ఉన్నారు. భారత హాకీ దిగ్గజం, దివంగత మేజర్‌ ధ్యాన్‌చంద్‌ గౌరవ సూచకంగా ..ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ డేను భారతీయ క్రీడాకారులు ప్రతియేడు ఓ వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున ఉత్తమ క్రీడాకారులకు, శిక్షకులకు అవార్డులను ఇచ్చి గౌరవించటం ఆనవాయితీగా వస్తోంది.

Follow Us