టీమ్ మేట్స్‌కు మిస్టర్ కూల్ విందు

రాంచీ: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మూడో వన్డే రాంచీలో జరగనుంది. బుధవారం సాయంత్రమే భారత్‌, ఆస్ట్రేలియా జట్లు అక్కడికి చేరుకున్నాయి. ధోనీ స్వస్థలం రాంచీ అన్న సంగతి తెలిసిందే. తన ఊరికి వచ్చిన టీమిండియా క్రికెటర్లకు మహీ, సాక్షి దంపతులు చక్కని విందు ఏర్పాటు చేశారు. రాంచీలోని అద్భుతమైన ఫామ్‌హౌజ్‌లో విందు భోజనాలను ఏర్పాటు చేసినందుకు ధోనీ దంపతులకు టీమిండియా క్రికెటర్లు ధన్యవాదాలు తెలియజేశారు.యుజువేంద్ర చాహల్‌ పార్టీకి సంబంధించిన ఓ ఫోటోని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. […]

టీమ్ మేట్స్‌కు మిస్టర్ కూల్ విందు
Ram Naramaneni

|

Mar 07, 2019 | 5:32 PM

రాంచీ: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మూడో వన్డే రాంచీలో జరగనుంది. బుధవారం సాయంత్రమే భారత్‌, ఆస్ట్రేలియా జట్లు అక్కడికి చేరుకున్నాయి. ధోనీ స్వస్థలం రాంచీ అన్న సంగతి తెలిసిందే. తన ఊరికి వచ్చిన టీమిండియా క్రికెటర్లకు మహీ, సాక్షి దంపతులు చక్కని విందు ఏర్పాటు చేశారు.

రాంచీలోని అద్భుతమైన ఫామ్‌హౌజ్‌లో విందు భోజనాలను ఏర్పాటు చేసినందుకు ధోనీ దంపతులకు టీమిండియా క్రికెటర్లు ధన్యవాదాలు తెలియజేశారు.యుజువేంద్ర చాహల్‌ పార్టీకి సంబంధించిన ఓ ఫోటోని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. అంతకు ముందు రాంచీ విమానాశ్రయంలో ఆటగాళ్లకు భారీ స్వాగతం లభించింది. కొంతమంది ఆటగాళ్లను ధోనీయే స్వయంగా తన కారులో తీసుకెళ్లాడు. బహుశా మిస్టర్‌ కూల్‌కు తన సొంత మైదానంలో ఇదే చివరి వన్డే అని భావిస్తున్నారు. ప్రపంచకప్‌ తర్వాత అతడు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu