ధోనికి రిప్లేస్‌మెంటా? నో వే! : మాజీ సెలెక్టర్ సంజయ్ జగ్దాలే
తన సొంత ప్రయోజనాల కన్నా దేశం కోసమే ధోనీ ఎల్లప్పుడూ ఆడాడని, అతడిని రిప్లేస్ చేయగల ఆటగాడు టీమిండియాలో మరొకరు లేరని బీసీసీఐ మాజీ సెలెక్టర్ సంజయ్ జగ్దాలే అన్నారు. ఒక వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా, సీనియర్‌గా అతడితో కంపార్ చేయగల మరొకరు కనిపించడం లేదు. ధోనీకి ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలో తెలుసని చెప్పిన జగ్దాలే… అతడి నుంచి బిసీసీఐ ఏం ఆశిస్తుందో కూడా తెలియజేయాలని సూచించాడు. ధోనీ 38 ఏళ్ల వయసులో మునుపటిలా ఆడాలనుకోవడం సరికాదని, […]
తన సొంత ప్రయోజనాల కన్నా దేశం కోసమే ధోనీ ఎల్లప్పుడూ ఆడాడని, అతడిని రిప్లేస్ చేయగల ఆటగాడు టీమిండియాలో మరొకరు లేరని బీసీసీఐ మాజీ సెలెక్టర్ సంజయ్ జగ్దాలే అన్నారు. ఒక వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా, సీనియర్‌గా అతడితో కంపార్ చేయగల మరొకరు కనిపించడం లేదు.
ధోనీకి ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలో తెలుసని చెప్పిన జగ్దాలే… అతడి నుంచి బిసీసీఐ ఏం ఆశిస్తుందో కూడా తెలియజేయాలని సూచించాడు. ధోనీ 38 ఏళ్ల వయసులో మునుపటిలా ఆడాలనుకోవడం సరికాదని, తమ కెరీర్‌లో సరిగ్గా ఆడని క్రికెటర్లు సైతం అతడిని విమర్శిస్తున్నారని పేర్కొన్నాడు. నిజమైన ఆటగాళ్లకే ధోనీ విలువ తెలుస్తుందని మాజీ సెలెక్టర్ వ్యాఖ్యానించాడు.