ఇండోనేషియా ఓపెన్ 2019: సెమీ ఫైనల్‌లోకి సింధు
జకార్తా వేదికగా జరుగుతోన్న ఇండోనేషియా ఓపెన్ 2019లో భారత షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు దూకుడును కొనసాగిస్తోంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌లో ప్రపంచ నెం.2 నోజోమి ఒకుహరాను సింధు 21-14, 21-7తేడాతో చిత్తుగా ఓడించింది. కేవలం 44 నిమిషాల్లోనే ఆమె ఈ మ్యాచ్‌ను ముగించింది. మ్యాచ్ ఆరంభంలో 3-0లీడ్‌ను అందుకున్న సింధు.. ఒకుహరాకు గట్టి పోటీనిస్తూ నిమిషాల వ్యవధిలో 5-5 ఆధిక్యాన్ని సమం చేసింది. ఆ తరువాత పుంజుకున్న సింధు […]
జకార్తా వేదికగా జరుగుతోన్న ఇండోనేషియా ఓపెన్ 2019లో భారత షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు దూకుడును కొనసాగిస్తోంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌లో ప్రపంచ నెం.2 నోజోమి ఒకుహరాను సింధు 21-14, 21-7తేడాతో చిత్తుగా ఓడించింది. కేవలం 44 నిమిషాల్లోనే ఆమె ఈ మ్యాచ్‌ను ముగించింది. మ్యాచ్ ఆరంభంలో 3-0లీడ్‌ను అందుకున్న సింధు.. ఒకుహరాకు గట్టి పోటీనిస్తూ నిమిషాల వ్యవధిలో 5-5 ఆధిక్యాన్ని సమం చేసింది. ఆ తరువాత పుంజుకున్న సింధు వరుసగా పాయింట్లు సాధిస్తూ 2114తో తొలి సెట్‌ను పూర్తి చేసింది. ఇక రెండో సెట్‌లో ఒత్తడికి గురైన ఒకుహర మరింత పేలవ ప్రదర్శనను కనబర్చింది. దీంతో ఆమెను చిత్తుగా ఓడించింది సింధు. కాగా సెమీ ఫైనల్‌లో సింధు ప్రపంచ నెం.3 చెన్ యుఫెయితో ఆమె తలపడనుంది.