Paralympics: భారత్ ఖాతాలో మరో పతకం.. పారాలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన భగత్. పసిడి సాధిస్తాడా.?
Paralympics: టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు రాణిస్తున్నారు. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 13 పతకాలు చేరాయి. వీటిలో రెండు పసిడి, ఆరు రజత, ఐదు కాంస్య...
Paralympics: టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు రాణిస్తున్నారు. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 13 పతకాలు చేరాయి. వీటిలో రెండు పసిడి, ఆరు రజత, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత షట్లర్ ప్రమోద్ భగత్ ఫైనల్‌కు చేరాడు. దీంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరినట్లైంది. పురుషుల సింగిల్స్ ఎస్ ఎల్ 3 సెమీ ఫైనల్‌లో భారత షట్లర్ ప్రమోద్ భగత్ 21-11, 21-16 తేడాతో జపాన్‌కు చెందిన డైసుకే ఫుజిహారాను ఓడించి ఫైనల్లోకి చేరాడు.
దీంతో భారత్‌కు రజత పతకం ఖాయం కాగా.. ఒకవేళ భగత్ ఫైనల్స్‌లో గెలిస్తే పసిడి పతకం దక్కనుంది. శనివారం ఉదయం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. తొలి సెట్‌ని 21-11తో అలవోకగా చేజిక్కించుకున్న ప్రమోద్ భగత్‌కి.. రెండో సెట్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. సెట్ మధ్యలో పుంజుకున్న జపాన్ షట్లర్.. గట్టి పోటీనిచ్చాడు. కానీ.. చివర్లో వరుసగా పాయింట్లు సాధించిన ప్రమోద్ రెండో సెట్‌ని కూడా 21-16తో చేజిక్కించుకుని ఫైనల్‌కి అర్హత సాధించాడు. బత్ ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే పారాలింపిక్స్‌లో భగత్ పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Corona in TS Schools: తెలంగాణ పాఠశాలల్లో కోవిడ్ విజృంభన … ఉపాధ్యాయులను వణికిస్తున్న కరోనా..
Petrol Diesel Price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు.. పెరిగాయా..? తగ్గాయా.? పూర్తి వివరాలు