Petrol Diesel Price: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. పెరిగాయా..? తగ్గాయా.? పూర్తి వివరాలు

Petrol Diesel Price: గత కొన్ని రోజుల క్రితం వరకు పరుగులు పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ఇటీవల కాస్త బ్రేక్‌ పడింది. సెప్టెంబర్‌ 1న స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌..

Petrol Diesel Price: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. పెరిగాయా..? తగ్గాయా.? పూర్తి వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Sep 04, 2021 | 8:39 AM

Petrol Diesel Price: గత కొన్ని రోజుల క్రితం వరకు పరుగులు పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ఇటీవల కాస్త బ్రేక్‌ పడింది. సెప్టెంబర్‌ 1న స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఇప్పటి వరకు నిలకడగా కొనసాగుతున్నాయి.  తాజాగా దేశంలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు ఉండకపోగా, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు వంద రూపాయలకుపైగా దాటిన పెట్రోల ధరలు వాహనదారుల నడ్డి విరుస్తోంది. ఇక దేశ వ్యాప్తంగా శనివారం (సెప్టెంబర్‌ 4) పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

దేశంలో ప్రధాన ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు:

► దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 101.34కి చేరగా, డీజిల్‌ రూ. 88.77 వద్ద కొనసాగుతోంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.39 ఉండగా, డీజిల్‌ రూ. 96.33కు చేరింది.

► చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 99.08 గా ఉండగా, డీజిల్‌ ధర రూ. 93.38 వద్ద కొనసాగుతోంది.

► బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 104.84 కాగా, డీజిల్‌ ధర రూ. 94.34 గా ఉంది.

► కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.72, డీజిల్‌ ధర రూ.91.84.

తెలుగు రాష్ట్రాల్లో ..

► హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.40 ఉండగా, డీజిల్‌ రూ. 96.84 గా ఉంది.

► వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.91 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.38గా ఉంది.

► మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.51గా ఉండగా, డీజిల్ ధర రూ.97.87గా ఉంది.

►రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.40 ఉండగా, డీజిల్ ధర రూ.97.88గా ఉంది.

► విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.36గా ఉండగా, డీజిల్‌ ధర రూ. 98.32 వద్ద కొనసాగుతోంది.

► విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 106.35 కాగా, డీజిల్‌ రూ. 97.33 గా నమోదైంది.

► కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.01గా ఉండగా, డీజిల్ ధర రూ.98.92గా ఉంది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ ఉంటాయి. దీంతో ధరలు ఒక రోజు పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Low CIBIL Score: సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే లోన్‌ పొందడం ఎలా..? రుణంకు స్కోర్‌కు సంబంధం ఏమిటి..?

HDFC Bank: మీరు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా?.. క్షణాల్లోనే లోన్‌ మంజూరు.. చెక్‌ చేసుకోండిలా!