కుర్రాళ్లు అదరహో! విండీస్ 95 పరుగులకే ఫ్యాకప్!

వెస్టిండీస్ టూర్ లో భాగంగా ఈరోజు తోలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా కుర్రాళ్లు బౌలింగ్‌తో అదరగొట్టారు. ప్రత్యర్థిని 95/9 పరుగులకే కట్టడి చేశారు. నవదీప్‌ సైని (4-1-17-3) తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. భువి 2 వికెట్లు తీశాడు. అలాగే వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, క్రునాల్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు తలా 1 వికెట్ దక్కింది..ఆరంభం నుంచే బౌలర్లు విండీస్‌ను విలవిల్లాడించారు. పొలార్డ్‌ (49; 49 బంతుల్లో 2×4, 4×6) […]

  • Ram Naramaneni
  • Publish Date - 10:02 pm, Sat, 3 August 19
కుర్రాళ్లు అదరహో! విండీస్ 95 పరుగులకే ఫ్యాకప్!

వెస్టిండీస్ టూర్ లో భాగంగా ఈరోజు తోలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా కుర్రాళ్లు బౌలింగ్‌తో అదరగొట్టారు. ప్రత్యర్థిని 95/9 పరుగులకే కట్టడి చేశారు. నవదీప్‌ సైని (4-1-17-3) తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. భువి 2 వికెట్లు తీశాడు. అలాగే వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, క్రునాల్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు తలా 1 వికెట్ దక్కింది..ఆరంభం నుంచే బౌలర్లు విండీస్‌ను విలవిల్లాడించారు. పొలార్డ్‌ (49; 49 బంతుల్లో 2×4, 4×6) టాప్‌ స్కోరర్‌. ఆఖరి ఓవర్‌ వరకు పోరాడాడు. అతడిని కూడా సైని అనూహ్యంగా  ఎల్బీ చేశాడు. ఆ తర్వాత నికోలస్‌ పూరన్‌ (20; 16 బంతుల్లో 1×4, 2×6) మాత్రమే రాణించాడు. ముగ్గురు బ్యాట్స్‌మన్‌ డకౌట్‌ అయ్యారు.