India vs England: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్.. రెండో వన్డేలో 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా..
India vs England 2nd Test Day 4 Live Score: నాలుగు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా..
India vs England 2nd Test Day 4 Live Score: నాలుగు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్‌లో 317 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా జయకేతనం ఎగురవేసింది. దీంతో సిరీస్ 1-1 తో సమంగా ఉంది. నాలుగు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ విన్ అవగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఇక రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం నుంచి.. ఆధిక్యతలోనే ఉన్న టీమిండియా.. ఇంగ్లండ్‌ను ఏ సమయంలోనూ నిలదొక్కుకోనివ్వలేదు. ముఖ్యంగా భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, అక్సర్ పటేల్ విజృంభణతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు.. కాసేపు నిలకడగానే ఆడినట్లు కనిపించినా.. అశ్విన్ బౌలింగ్‌లో లారెన్స్ స్టంప్ ఔట్ అయ్యాడు. అది మొదలు.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరు వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. మొత్తంగా నాలుగో రోజు 54 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ జట్టు 164 పరుగులు మాత్రమే చేసి టీమిండియా చేతిలో దారుణంగా ఓటమిపాలైంది.
ఇక రెండో టెస్ట్ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ జట్టును హడలెత్తించాడు. ఈ మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టడమే కాకుండా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 106 పరుగులతో సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. టీమిండియా ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి నుంచే దూకుడు ప్రదర్శిస్తూ ఆడాడు. తన బ్యాట్‌తో వీర విహారం చేశాడు. తొలుత 130 బంతులకే సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ అనంతరం ఆటను నిలకడగా కొనసాగించాడు. మొత్తంగా 231 బంతులు ఆడిన రోహిత్ శర్మ 161 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉసూరుమనించాడు. డకౌట్ అయి క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేశాడు. భారత్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 616 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 300 పరుగులు కూడా చేయలేకపోయింది.
బౌలింగ్ విషయానికి వస్తే.. అశ్విన్ తరువాత అక్సర్ పటేల్, ఇశాంత్ శర్మ అద్భుతమైన బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించారు. ఇటు స్పిన్ మాయాజాలంతో పాటు, ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును హడలెత్తించారు. వరుసగా వికెట్లు పడగొట్టి టీమిండియాకు అద్భుత విజయాన్ని సాధించి పెట్టారు. రెండో టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ అక్సర్ పటేల్ 7 వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు చొప్పున తీసుకున్నారు.
స్కోర్లు..: భారత్: 329 & 286 ఇంగ్లండ్: 134 & 164
Also read: