నేడే అండర్‌–19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌.. ‘యువ’ భారత్‌ మళ్లీ సాధిస్తుందా!

సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన బంగ్లా జట్టు.. తొలిసారి అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది. నాలుగు సార్లు ఇప్పటికే విజేతగా నిలిచిన జట్టు ఒకవైపు… ఇంతకుముందు ఏ స్థాయిలో కూడా ప్రపంచకప్‌లో కనీసం ఫైనల్‌కు చేరుకోని జట్టు మరోవైపు… టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచిన రెండు టీమ్‌లు… ప్రస్తుతం బలాబలాలపరంగా చూస్తే దాదాపుగా సమ ఉజ్జీలు… ఈ నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్‌ మధ్య […]

నేడే అండర్‌–19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌.. ‘యువ’ భారత్‌ మళ్లీ సాధిస్తుందా!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 09, 2020 | 5:03 AM

సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన బంగ్లా జట్టు.. తొలిసారి అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది. నాలుగు సార్లు ఇప్పటికే విజేతగా నిలిచిన జట్టు ఒకవైపు… ఇంతకుముందు ఏ స్థాయిలో కూడా ప్రపంచకప్‌లో కనీసం ఫైనల్‌కు చేరుకోని జట్టు మరోవైపు… టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచిన రెండు టీమ్‌లు… ప్రస్తుతం బలాబలాలపరంగా చూస్తే దాదాపుగా సమ ఉజ్జీలు… ఈ నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్‌ మధ్య అండర్‌–19 ప్రపంచకప్‌ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే ఈ ఆసియా జట్ల పోరులో చాంపియన్‌ ఎవరనేది కొన్ని గంటల్లో తేలిపోతుంది.

బంగ్లా జట్టు టైటిల్ కోసం ఫైనల్‌ పోరులో భారత్‌ను ఢీకొట్టనుంది. తమ టైటిల్‌ నిలబెట్టుకునేందుకు టీమిండియా బరిలోకి దిగుతుండగా, ఈ సువర్ణావకాశాన్ని వదులుకోరాదని బంగ్లాదేశ్‌ పట్టుదలగా ఉంది. ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం ఇక్కడ భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఐసీసీ సోమవారాన్ని ‘రిజర్వ్‌ డే’గా పెట్టింది. ఆ రోజూ మ్యాచ్‌ సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.