సెలెక్టర్లపై బంగర్ దురుసు ప్రవర్తన!

సెలెక్టర్లపై బంగర్ దురుసు ప్రవర్తన!

టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కొత్త కోణం ఒకటి బయటికి వచ్చింది. కోచ్ పదవి నుంచి తప్పించిన అనంతరం బంగర్.. కోపంతో ఊగిపోయి.. సెలక్షన్ కమిటీ సభ్యుడు దేవాంగ్ గాంధీని బెదిరించాడు. రెండు వారాల క్రిందట జరిగిన ఈ ఘటన విండీస్ టూర్ ముగిసిన అనంతరం వెలుగులోకి వచ్చింది. మరోవైపు హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌లు తిరిగి నియామకం కాగా, ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత జట్టు […]

Ravi Kiran

|

Sep 05, 2019 | 2:05 AM

టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కొత్త కోణం ఒకటి బయటికి వచ్చింది. కోచ్ పదవి నుంచి తప్పించిన అనంతరం బంగర్.. కోపంతో ఊగిపోయి.. సెలక్షన్ కమిటీ సభ్యుడు దేవాంగ్ గాంధీని బెదిరించాడు. రెండు వారాల క్రిందట జరిగిన ఈ ఘటన విండీస్ టూర్ ముగిసిన అనంతరం వెలుగులోకి వచ్చింది.

మరోవైపు హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌లు తిరిగి నియామకం కాగా, ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత జట్టు ఓటమికి బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగరే కారణమన్న ఆరోపణలతో అతడిని తప్పించిన సంగతి తెలిసిందే.

విండీస్ పర్యటనలో ఉన్న బంగర్‌కు ఈ విషయం తెలియడంతో అతడు జీర్ణించుకోలేక.. హోటల్‌లో బస చేస్తున్న సెలక్షన్ కమిటీ సభ్యుడు దేవాంగ్ గాంధీ తలుపును బలంగా తన్నుతూ గదిలోకి ప్రవేశించాడు. అనంతరం ఆయనతో అసభ్యంగా మాట్లాడాడు. జట్టు తనకు అండగా ఉందని, తనను తొలగిస్తే వారు ఒప్పుకోరని చెప్పాడు. బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేయకుంటే జాతీయ క్రికెట్ అకాడమీలో ఏదైనా పదవి ఇవ్వాలని బెదిరించినట్లు సమాచారం.

ఇక ఈ విషయం బయటికి రావడంతో ఇప్పుడు సంచలనం అయింది. దీనిపై సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ నిజనిర్దారణకు కమిటీ వేశారు. బంగర్ దురుసు ప్రవర్తన నిజమేనని తేలితే సీవోఏ వేటు వేసే అవకాశం కూడా ఉంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu