‘ నాయనా ! విరాటూ ! చలాన్ కట్టి ఇలా అయిపోయావా ? ‘

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎందుకో ఒక్కసారిగా వైరాగ్యంలోకి దిగిపోయినట్టున్నాడు. ‘ మనల్ని మనం అంతర్లీనంగా చూసుకుంటున్నంత వరకు-బయట దేన్నీ చూడాల్సిన అవసరం ఉండదు ‘ అనే క్యాప్షన్ తో.. షర్ట్ లేకుండా కూచుండిపోయినట్టున్న తన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అంతే ! ‘ గూజ్ బంప్స్ ‘ తో కొందరు ఫ్యాన్స్ , హిలేరియస్ (తమాషా) కామెంట్లు, ఫొటోలతో మరికొందరు ‘ చెలరేగిపోయారు ‘. బహుశా ట్రాఫిక్ ఉల్లంఘనకు ఈయన పెద్ద మొత్తంలో చలాన్ […]

' నాయనా ! విరాటూ ! చలాన్ కట్టి ఇలా అయిపోయావా ? '
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Sep 05, 2019 | 5:47 PM

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎందుకో ఒక్కసారిగా వైరాగ్యంలోకి దిగిపోయినట్టున్నాడు. ‘ మనల్ని మనం అంతర్లీనంగా చూసుకుంటున్నంత వరకు-బయట దేన్నీ చూడాల్సిన అవసరం ఉండదు ‘ అనే క్యాప్షన్ తో.. షర్ట్ లేకుండా కూచుండిపోయినట్టున్న తన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అంతే ! ‘ గూజ్ బంప్స్ ‘ తో కొందరు ఫ్యాన్స్ , హిలేరియస్ (తమాషా) కామెంట్లు, ఫొటోలతో మరికొందరు ‘ చెలరేగిపోయారు ‘. బహుశా ట్రాఫిక్ ఉల్లంఘనకు ఈయన పెద్ద మొత్తంలో చలాన్ చెల్లించి ఇలా దిగాలుగా కూర్చుని ఉన్నట్టున్నాడు ‘ అని కొందరుసెటైర్ వేశారు. ఈ నెల 3 న గురుగ్రామ్ లో హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు, ఆర్ సి బుక్ లేనందుకు ఒక వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు 23 వేల రూపాయల చలాన్ విధించారు. దీంతో సోషల్ మీడియాలో ‘ మేమ్ ‘ లు వెల్లువెత్తాయి. కోహ్లీ అభిమానులు ఈ ఫోటోను, చలానా జరిమానాను ముడిపెడుతూ చెండాడేశారు. ఇంకా ఇలాంటివే బోలెడు ఫోటోలు కూడా ప్రత్యక్షమయ్యాయి. (టెస్ట్ క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఇండియన్ కెప్టెన్ గా రికార్డులకెక్కాడు కోహ్లీ. అలాగే ఇటీవల ‘ కరేబియన్ టూర్ ‘ లో నెలరోజుల పాటు సాగిన ‘ పోరాటం ‘ లో వెస్టిండీస్ పై మూడు ఫార్మాట్లలో టీమిండియా గెలిచిందంటే అది కోహ్లీ చలవే మరి !)