కొంచెం తీపి.. కొంచెం చేదు.. చిదంబరానికి మిక్స్ డ్ ఫీల్ !
కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి గురువారం ‘ మిక్స్ డ్ ఫీల్ ‘ కలిగింది. ఒక కేసులో కాస్త ఊరట.. మరో కేసులో నిరాశ.. ఎయిర్ సెల్-మాక్సిస్ కేసులో ఆయనకు సీబీఐ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి కూడా ‘ ప్రొటెక్షన్ ‘ లభించింది. అయితే ఐ ఎన్ ఎక్స్ మీడియాకేసులో ఇప్పటికే అరెస్టయిన చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రెగ్యులర్ […]
కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి గురువారం ‘ మిక్స్ డ్ ఫీల్ ‘ కలిగింది. ఒక కేసులో కాస్త ఊరట.. మరో కేసులో నిరాశ.. ఎయిర్ సెల్-మాక్సిస్ కేసులో ఆయనకు సీబీఐ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి కూడా ‘ ప్రొటెక్షన్ ‘ లభించింది. అయితే ఐ ఎన్ ఎక్స్ మీడియాకేసులో ఇప్పటికే అరెస్టయిన చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రెగ్యులర్ బెయిల్ కోసం ప్రత్యేక న్యాయస్థానంలో ఆయన పిటిషన్ దాఖలు చేసుకోవచ్ఛునని సూచించింది. ఈ కేసులో ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు కోర్టు తిరస్కరించడమే గాక.. ఆయనను తమ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని కోరుతూ ఈడీ పెట్టుకున్న అప్పీలుకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందస్తు బెయిలును ఓ హక్కుగా అందరికీ మంజూరు చేసే పరిస్థితి ఉండదు.. ఆర్ధిక నేరాలను భిన్నంగా పరిగణించాల్సి ఉంటుంది అని కోర్టు పేర్కొంది. దర్యాప్తు తొలి దశలో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తు ప్రక్రియపై దాని ప్రభావం ఉంటుందని అభిప్రాయపడింది. ఎయిర్ సెల్-మాక్సిస్ కేసులో చిదంబరానికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో ఈడీ ఆయనను ఏ సమయంలోనైనా మళ్ళీ అరెస్టు చేయవచ్ఛు. కాగా-సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు అనంతరం ట్వీట్ చేసిన కార్తీ చిదంబరం.. కొంతవరకు తాము విజయం సాధించామని అన్నారు. ఇది అసలు కేసే కాదని తాను మొదటినుంచీ చెబుతూనే ఉన్నానని, రాజకీయ కక్షతోనే తమను ఈ కేసులోకి లాగారని ఆయన ఆరోపించారు. ఎయిర్ సెల్-మాక్సిస్ కేసుతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. అటు-ఎయిర్ సెల్-మాక్సిస్ కేసులో ఒకవేళ ఈ తండ్రీ కొడుకులను అరెస్టు చేయవలసివస్తే.. లక్ష రూపాయల పర్సనల్ పూచీకత్తుపైన, ష్యురిటీ బాండ్ పైన విడుదల చేయవచ్చునని సీబీఐ స్పెషల్ కోర్టు పేర్కొంది. అయితే నిందితులు దర్యాప్తునకు సహకరించాలని సూచించింది.