టీఆర్‌ఎస్‌లో ఫైట్స్.. బీజేపీకి లాభమా..? ఈటెల పార్టీ నుంచి జంప్ అవబోతున్నారా..?
టీఆర్‌ఎస్ పార్టీలో చీలికలు వచ్చేటట్టే కనిపిస్తున్నాయి. మరో పక్క తెలంగాణలో బీజేపీ పార్టీ ‘ఆకర్ష్’ జోరుగా నడుస్తోంది. సైలెంట్‌గా నేతలను వారివైపు తిప్పుకునే పనిలో పడ్డారు. మరి ఈ విధంగా చూస్తే ఇది సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీలో కీలక పదవిని పోషిస్తోన్నమంత్రి ఒకరు పార్టీ మారబోతున్నారని.. అందుకే.. ఇలా ఎడమొహం.. పెడ మొహంగా ఉన్నట్లు సమాచారం. సీఎంనే కేబినెట్ మీటింగ్ పెట్టినా.. నాకు సంబంధం లేనట్టుగా.. ఆయన పర్యటనలు చేస్తున్నారు. తాజాగా.. మంత్రి ఈటెల […]
టీఆర్ఎస్ పార్టీలో చీలికలు వచ్చేటట్టే కనిపిస్తున్నాయి. మరో పక్క తెలంగాణలో బీజేపీ పార్టీ ‘ఆకర్ష్’ జోరుగా నడుస్తోంది. సైలెంట్‌గా నేతలను వారివైపు తిప్పుకునే పనిలో పడ్డారు. మరి ఈ విధంగా చూస్తే ఇది సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీలో కీలక పదవిని పోషిస్తోన్నమంత్రి ఒకరు పార్టీ మారబోతున్నారని.. అందుకే.. ఇలా ఎడమొహం.. పెడ మొహంగా ఉన్నట్లు సమాచారం. సీఎంనే కేబినెట్ మీటింగ్ పెట్టినా.. నాకు సంబంధం లేనట్టుగా.. ఆయన పర్యటనలు చేస్తున్నారు.
తాజాగా.. మంత్రి ఈటెల రాజేందర్‌కు కేసీఆర్‌కు మధ్య దూరం పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన కీలక సమావేశానికి ఈటెల రాకపోవడం.. రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ముందుగానే.. అధినేతకు సమాచారమిచ్చి.. ఆయన రాలేదా..? లేక అధినేత మాట ఖాతరు చేయలేదా..? అని వివిధ రకాల.. వార్తలు గుప్పుమంటున్నాయి. హైదరాబాద్‌లోనే సమావేశం ఉంది. ఈటెల కూడా.. హైదరాబాద్‌లోనే ఆస్పత్రుల్లోనే.. రోగులను పరామర్శిస్తున్నారు. దీంతో.. కేసీఆర్ మాటను ఈటెల ఖాతరు చేయలేదని.. పార్టీలోని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే.. ఈటెల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి స్వస్తి చెప్పబోతున్నారా..! అంటూ.. వార్తలు షికారు చేస్తున్నాయి.
కాగా.. ఇప్పుడు ఇదే ఇష్యూపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. కేటీఆర్ మరింత ఆజ్యం పోశారు. పదవులు రాగానే కొంతమంది నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. పదవులు వచ్చింది పార్టీ వల్లే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించిన ఆయన.. ప్రజలే బాసులనే విషయాన్ని నేతలు గుర్తు పెట్టుకోవాలంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ కామెంట్స్ చూస్తుంటే.. ఈటెలతో వార్‌ను ఓపెన్‌గా డిక్లేర్ చేసినట్లేనన్న మాట కూడా వినిపిస్తోంది.
అసలు ఇంతలా టీఆర్‌ఎస్ పార్టీ.. ఈటెలనే ఎందుకు టార్గెట్‌గా నిలిచారు..? అసలు ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలేంటో.. తెలుసుకుందామా.. సహనంగా ఉండేవాడు.. సహనాన్ని కోల్పోతే.. ఏదో అనర్థం తప్పకుండా జరుగుతందని పెద్దలు అంటూంటారు. సాధారణంగానే ఈటెల రాజేందర్ తన సహనాన్ని కోల్పోయి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలే తెలంగాణలో ప్రకంపనలు సృష్టించాయి. టీఆర్ఎస్ పార్టీ బీటలు వారే స్థితికి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
గులాబీ పార్టీల్లో సీనియర్ నాయకుడు.. ఈటెల రాజేందర్.. కొంత కాలంగా.. తనపై.. సోషల్ మీడియాల్లో.. పత్రికల్లో వస్తోన్న వివిధ వార్తలకు ధీటుగా జవాబిచ్చారు. తనకు మంత్రి పదవి ఎవరో భిక్ష వేస్తే.. రాలేదని.. మేము ప్రజల మనసుల్లోకి వెళ్లి.. ఓట్లను సాధించి తెచ్చుకున్నామని తెలిపారు. ఈ మాటలే.. స్థానికంగా.. కార్యకర్తల్లో.. ఇటు పార్టీలో.. కీలకంగా మారాయి.
ఇప్పుడు.. ఇదే విషయంపై బీజేపీ పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. విలువ లేని చోట.. క్షణమైన నిలబడకూడదని.. పెద్దలు అంటూంటారు. ఈ మాటలనే చెప్పి.. ఈటెలను తమవైపుకు తిప్పుకోవాలని చూస్తున్నారని.. సమాచారం. ఒకవేళ ఈటెల గనుక బీజేపీలో చేరితే.. ఆయన వెంటే.. ఆయన కార్యకర్తలను.. పెద్ద బలగాన్ని కూడా వెంటతీసుకుపోతారు. ఈ విధంగా చూస్తే.. టీఆర్ఎస్ పార్టీ.. పెద్ద నేతను కోల్పోయినట్టే. అంతేగాక.. ప్రజల్లో పార్టీపై.. చెడు ప్రభావం కూడా పడే ప్రమాదముంది. ఏదిఏమైనప్పటికీ.. బీజేపీ ఆకర్ష్ సక్సెస్ అవుతుందా.. అన్న వ్యాఖ్యలు వినవస్తోన్నాయి.