మీ వందరోజుల పాలన… సాగిందంతా ‘రివర్స్‌’లోనే… బాబు ఫైర్!

వైఎస్ జగన్ 100 రోజుల పాలనపై చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వం ఏదైనా వంద రోజుల్లో ఓ దశాదిశ ఏర్పాటు చేసుకుంటుందనీ, కానీ ఈ ప్రభుత్వం మాత్రం వంద రోజుల్లో అప్రతిష్టపాలై ప్రజల్లో చులకనైందని చంద్రబాబు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన జిల్లా తెదేపా విస్త్రృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ… జగన్ వంద రోజుల పాలనలో ఎక్కడ చూసిన విధ్వంసాలేనని చంద్రబాబుతెలిపారు. సొంత బాబాయిని ఇంట్లోనే చంపేస్తే.. ఎవరూ చంపారో […]

మీ వందరోజుల పాలన... సాగిందంతా 'రివర్స్‌'లోనే... బాబు ఫైర్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 05, 2019 | 5:55 PM

వైఎస్ జగన్ 100 రోజుల పాలనపై చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వం ఏదైనా వంద రోజుల్లో ఓ దశాదిశ ఏర్పాటు చేసుకుంటుందనీ, కానీ ఈ ప్రభుత్వం మాత్రం వంద రోజుల్లో అప్రతిష్టపాలై ప్రజల్లో చులకనైందని చంద్రబాబు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన జిల్లా తెదేపా విస్త్రృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ… జగన్ వంద రోజుల పాలనలో ఎక్కడ చూసిన విధ్వంసాలేనని చంద్రబాబుతెలిపారు. సొంత బాబాయిని ఇంట్లోనే చంపేస్తే.. ఎవరూ చంపారో చెప్పలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా.. తన బాబాయిని హత్య చేసింది ఎవరో తేల్చాలని జగన్‌కు బాబు చురకలు అంటించారు.

వైఎస్ జగన్ వంద రోజుల పాలన విధ్వంసం.. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైందని బాబు తెలిపారు. వైఎస్ఆర్సీపీది రాక్షస పాలనగా అభివర్ణించారు. ప్రజావేదికను కట్టడానికి 8 నెలలు పడితే.. 2-3 గంటల్లోనే కూల్చేశారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావేదికను జాగ్రత్తగా విప్పేసి ఉంటే.. మరో చోట మెటీరియల్‌ను వాడుకునే అవకాశం ఉండేదన్నారు. ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ సర్కారు విధ్వంసానికి నాంది పలికిందన్నారు.

వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టీడీపీ నేతల పట్ల కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. 8 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడులో టీడీపీ కార్యకర్తలను గ్రామాల నుంచి కొట్టి పంపేస్తున్నారని బాబు ఆరోపించారు. చరిత్రలో తొలిసారి ప్రభుత్వ బాధితుల కోసం పునరావాస కేంద్రం పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం. ఇది మన దౌర్భాగ్యం అని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులకు గట్టిగా చెబుతున్నా.. తాత్కాలిక పోస్టింగ్‌ల కోసం టీడీపీ కార్యకర్తలను వేధించొద్దని హెచ్చరించారు.

టెండర్లు కాదు… జగన్ పాలనే రివర్స్‌లో పోతోందని బాబు ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో రాష్ట్రంలో ఒక్క పని కూడా ముందుకు పోలేదన్నారు. అవినీతి గురించి సీఎం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాము నిర్మించిన ఇళ్ల పనులను జగన్ నిలిపేశారని విమర్శించారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని చంపేసే పరిస్థితికి తెచ్చారని, పైసా ఖర్చులేకుండా సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌తో ముందుకు పోయే ప్రాజెక్టును దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వంద రోజుల్లో ఏ ఊళ్లో అయినా ఒక్క పని జరిగిందా అని ప్రశ్నించారు. ఊరికో ప్యాలస్‌ కట్టుకున్న వ్యక్తి గృహనిర్మాణంలో అవినీతి అంటున్నారని ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు.. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. పల్నాడులో టీడీపీ కార్యకర్తలను గ్రామాల నుంచి కొట్టి పంపేస్తున్నారని బాబు ఆరోపించారు.

‘‘సీఎం జగన్ ముందు నామీద పెత్తనం చేయాలని భావించారు. తర్వాత మన పార్టీ నాయకుల మీద పెత్తనం చేయాలని భావించారు. తప్పుడు కేసులు పెడుతూ మనవాళ్లను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నార’’ని బాబు ఆరోపించారు. భయమనే మాట తెలుగుదేశం పార్టీకి తెలీదని చంద్రబాబు తెలిపారు. మీలాగే మేం కూడా అని కూడా అనుకొని ఉంటే.. వీళ్లెవరూ అడ్రస్ ఉండేవాళ్లు కారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.