AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shafali Verma: ప్రతీ సిక్స్‌కి రూ.5లు అంటూ తండ్రి ప్రోత్సాహం.. అన్నతో కలిసి ప్రాక్టీస్.. కట్‌చేస్తే.. లేడీ సెహ్వాగ్ రికార్డుల మోత..

షిఫాలీ స్వస్థలం, హర్యానాలోని రోహతక్ దగ్గరున్న లాహ్లి... షఫాలీ తొలి గురువు తన తండ్రి సంజివ్ వర్మ. బేసిక్స్ ఆయన దగ్గర నుంచే నేర్చుకుంది. అతను ఒక నగల వ్యాపారి అంతకుమించి క్రికెట్ ప్రేమికుడు కూడా. కొడుక్కి క్రికెట్ నేర్పుతూ కూతురుని గ్రౌండ్ కు ఫ్రెండ్ పెట్టుకొని వెళ్లేవాడు. అలా అన్నయ్య తండ్రితో కలిసి సాధన చేసింది షఫాలి.

Shafali Verma: ప్రతీ సిక్స్‌కి రూ.5లు అంటూ తండ్రి ప్రోత్సాహం.. అన్నతో కలిసి ప్రాక్టీస్.. కట్‌చేస్తే.. లేడీ సెహ్వాగ్ రికార్డుల మోత..
Shafali Verma
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Jun 30, 2024 | 1:42 PM

Share

లేడీస్ సెహ్వాగ్ అంటే వెంటనే గుర్తొచ్చేది షెఫాలి వర్మ 15 ఏళ్ల వయసు నుంచి మహిళా క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తూ శభాష్ షఫాలి అనిపించుకుంటుంది. తాజాగా దక్షిణ ఆఫ్రికాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించింది ఈ లేడీ సెహ్వాగ్. షిఫాలీ స్వస్థలం, హర్యానాలోని రోహతక్ దగ్గరున్న లాహ్లి… షఫాలీ తొలి గురువు తన తండ్రి సంజివ్ వర్మ. బేసిక్స్ ఆయన దగ్గర నుంచే నేర్చుకుంది అతను ఒక నగల వ్యాపారి అంతకుమించి క్రికెట్ ప్రేమికుడు కూడా. కొడుక్కి క్రికెట్ నేర్పుతూ కూతురుని గ్రౌండ్ కు ఫ్రెండ్ పెట్టుకొని వెళ్లేవాడు. అలా అన్నయ్య తండ్రితో కలిసి సాధన చేసింది షఫాలి. ఆమె కొట్టే ప్రతి సిక్స్ కి అయిదు రూపాయల బహుమతిగా ఇచ్చేవాడు తండ్రి. ఎప్పుడైనా మిగతా పిల్లలతో కలిసి ఆడిద్దాం అనుకుంటే ఆడపిల్లలతో మేమేం ఆడం అని వాళ్ళు నిర్మొహమాటంగానే చెప్పేవారు. ఈ మాటలు చెప్పాలని బాగా బాధించాయి.

అంతేనా స్థానిక రోహతకు అకాడమీ కూడా ఆడపిల్లల్ని చేర్చుకోమని చెప్పింది. దాంతో జుట్టు కత్తిరించుకుని అచ్చంగా అబ్బాయిల మారింది శఫలి చివరకు రామ్ నారాయణ క్రికెట్ షేఫాలికి క్రికెట్లో శిక్షణ ఇవ్వడానికి ఒప్పుకుంది. ఆ వయసులో ఆమె ప్రతిభను చూసే అవకాశం వచ్చింది. తను అమ్మాయిని అని భావించకుండా అబ్బాయిలతోనే కలిసి ఆడేది గాయాలన్నీ లెక్క చేయకుండా 16 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళేది.. బంధువులు మాత్రమే ఇదేంటి ఆడపిల్లని ఇలాగైనా పెంచడం అంటే తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచారు. అయినా వాళ్ళు కూడా ఆ మాటలను లెక్కచేయలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే అండర్ 19 లో రాణించింది. 15 ఏళ్లకే అంతర్జాతీయ మ్యాచుల్లో అడుగు పెట్టింది. సచిన్ 16 ఏళ్ళకి అంతర్జాతీయ మ్యాచుల్లో రికార్డ్ సృష్టించగా.. 15 ఏళ్లకే ఆ రికార్డును సొంతం చేసుకుంది. టి20లో రికార్డుల మోత మోగించింది వరల్డ్ ర్యాంకింగ్స్ లోకి చకచకా దూసుకెళ్లిపోతోంది. ప్రత్యర్థి ఎవరైనా తనదైన శైలిలో ఆడుతూ మ్యాచ్ ను వంటి చేత్తో గెలిపించే ఆటగాళ్లు తరానికి ఒకరు వస్తారు. అలాంటి సత్తా షేఫాలిలో చూసా అంటూ సీనియర్ మిథాలీ రాజ్ నుంచి ప్రశంసలు అందుకుంది. మైదానంలో అడుగు పెడితే విద్వంసం సృష్టించే షిఫాలీని అభిమానులు లేడీ సెహ్వాగ్ అని ఇష్టంగా పిలుచుకుంటారు. 2023లో జరిగిన అభిమన్ ప్రీమియర్ లీగ్ ఆకర్షణలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు కోట్లతో షఫాలి సొంతం చేసుకుంది. తాజాగా దక్షిణాఫ్రికా తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో మహిళ టెస్టుల్లో అత్యంత వేగంగా డబల్ సెంచరీ పూర్తి చేసి మరో రికార్డ్ సృష్టించింది షెఫాలి. ఇలాంటి మరెన్నో రికార్డ్ లు సృష్టించాలని కోరుకుందాము.