యూవీ భార‌త జ‌ట్టు కోచ్ అయితే ఏం చేస్తాడు..అత‌ని మాటల్లోనే…

యూవీ భార‌త జ‌ట్టు కోచ్ అయితే ఏం చేస్తాడు..అత‌ని మాటల్లోనే...

భార‌త్ క్రికెట్ టీమ్ కు తాను కోచ్ అయితే రాత్రి 10 గంటలకి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాని మ‌ద్యం తాగేందుకు తీసుకెళ్తానని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్టాండ‌ర్డ్స్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన యూవీ.. కోచ్ అనేవాడు ప్లేయ‌ర్స్ మైండ్ సెట్స్‌ అర్థం చేసుకుని వారితో వ్యవహరించాలని సూచించాడు. 2019 వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ సెమీస్‌లో పేలవ బ్యాటింగ్ కారణంగా ఇండియా జట్టు ఓడిపోగా.. […]

Ram Naramaneni

|

May 13, 2020 | 11:34 PM

భార‌త్ క్రికెట్ టీమ్ కు తాను కోచ్ అయితే రాత్రి 10 గంటలకి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాని మ‌ద్యం తాగేందుకు తీసుకెళ్తానని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్టాండ‌ర్డ్స్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన యూవీ.. కోచ్ అనేవాడు ప్లేయ‌ర్స్ మైండ్ సెట్స్‌ అర్థం చేసుకుని వారితో వ్యవహరించాలని సూచించాడు. 2019 వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ సెమీస్‌లో పేలవ బ్యాటింగ్ కారణంగా ఇండియా జట్టు ఓడిపోగా.. అప్పటి బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌ని తప్పించిన బీసీసీఐ.. విక్రమ్ రాథోడ్‌ని అతని ప్లేసులో నియ‌మించింది

భార‌త జాతీయ జ‌ట్టు తరఫున 1996-97 మధ్య కాలంలో 7 వన్డేలు, 6 టెస్టులు మాత్రమే ఆడిన విక్రమ్ రాథోడ్.. కనీసం ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. దాంతో.. ప్రస్తుతం ఉన్న టీ20 జనరేషన్ క్రికెటర్ల‌కి అతను ఏ మేరకు గైడ్ చెయ్య‌గ‌ల‌డు..? అని యువరాజ్ సింగ్ ప్రశ్నించాడు. అలానే చీఫ్ కోచ్ రవిశాస్త్రి కూడా ప్లేయ‌ర్స్ తో సరదాగా ఉంటాడ‌ని తాను అనుకోవట్లేదని యువీ చెప్పుకొచ్చాడు.

‘‘విక్రమ్ రాథోడ్ నా ఫ్రెండ్. అయితే.. టీ20 జనరేషన్ క్రికెటర్లకి ఓ కోచ్‌గా అతను గైడ్ చేయగలడని మీరు అనుకుంటున్నారా..? రాథోడ్ ఆ స్థాయిలో క్రికెట్ ఆడి ఉంటే హోల్ప్ చేసుండేవాడేమో..? ఒకవేళ నేను కోచ్ అయితే రాత్రి 9 గంటకి జస్‌ప్రీత్ బుమ్రాకి గుడ్‌నైట్ చెప్పి.. రాత్రి 10 గంటలకి హార్దిక్ పాండ్యాని మ‌ద్యం పార్టీకి తీసుకెళ్తా. ఇలా మైండ్ సెట్స్ బట్టి ప్లేయ‌ర్స్ కోచ్ వ్యవహరించాలి. చీఫ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఆ తరహాలో వ్యవహరిస్తుంటాడని నేను అనుకోవట్లేదు. అతని వ్యాపకాలు వేరే ఉంటాయి’’ అని యువీ పేర్కొన్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu