హిందూ ఆలయంలో అఫ్రిదీ సేవా కార్యక్రమాలు.. ‘సాహో’ అంటున్న నెటిజన్లు

పాకిస్తాన్‌లో కరోనా వైరస్ విజృంభణ మొదలైన దగ్గర నుంచి ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తన ఫౌండేషన్ ద్వారా విరాళాలు సేకరించి పేదలకు తోచినంత సహాయం చేస్తూ ఉన్నాడు. పాక్‌లోని మారుమూల ప్రాంతాలకు కూడా అతడు వెళ్లి కష్టాల్లో ఉన్నవారందరికీ నిత్యావసర వస్తువులను అందిస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా అఫ్రిదీ ఓ హిందూ ఆలయానికి వెళ్ళాడు. అక్కడ జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అంతేకాకుండా కొంతమంది పేదవారికి నిత్యావసరాలను అందజేశాడు. ‘ఐక్యతే మన […]

హిందూ ఆలయంలో అఫ్రిదీ సేవా కార్యక్రమాలు.. 'సాహో' అంటున్న నెటిజన్లు
Follow us

|

Updated on: May 14, 2020 | 2:19 PM

పాకిస్తాన్‌లో కరోనా వైరస్ విజృంభణ మొదలైన దగ్గర నుంచి ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తన ఫౌండేషన్ ద్వారా విరాళాలు సేకరించి పేదలకు తోచినంత సహాయం చేస్తూ ఉన్నాడు. పాక్‌లోని మారుమూల ప్రాంతాలకు కూడా అతడు వెళ్లి కష్టాల్లో ఉన్నవారందరికీ నిత్యావసర వస్తువులను అందిస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా అఫ్రిదీ ఓ హిందూ ఆలయానికి వెళ్ళాడు. అక్కడ జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అంతేకాకుండా కొంతమంది పేదవారికి నిత్యావసరాలను అందజేశాడు.

‘ఐక్యతే మన బలం. తాజాగా శ్రీ లక్ష్మీనారాయణ్ మందిర్‌కు వెళ్లి అక్కడ ఇబ్బందులు ఎదుర్కుంటున్నవారికి నిత్యావసరాలను అందించానని’ షాహిద్ అఫ్రిదీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. మరోవైపు కరోనాతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకునేందుకు అఫ్రిదీ.. తన సర్వీసులను పలు బ్రాండ్స్ ఫ్రీగా ఉపయోగించుకోవచ్చునని.. బదులుగా తనకు రేషన్ ఇస్తే చాలని అన్నాడు. దీనితో కరోనా కష్టకాలంలో అఫ్రిది చేసే పనులకు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read This: ప్రార్ధనా మందిరాలు మూసేసి.. మద్యం షాపులు తెరవడమేంటి.?