వారిద్దరూ క్రికెట్‌లో ఫెడరర్, నాడెల్‌లు..
అంతర్జాతీయ క్రికెట్‌లో రారాజులుగా ఏలుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌లపై మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. వీరిద్దరూ కూడా క్రికెట్‌లో రోజర్ ఫెదరర్, రఫెల్ నాడెల్‌లు అని కితాబిచ్చాడు. జింబాబ్వే మాజీ బౌలర్, కామెంటేటర్ పొమినె బాంగ్వాతో ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లో మాట్లాడిన ఏబీ.. విరాట్, స్మిత్‌లలో ఎవరు గొప్ప క్రికెట్ అన్న ప్రశ్నకు పైవిధంగా స్పందించాడు. సహజసిద్దమైన ఆట ఆడే కోహ్లిని టెన్నిస్‌లో స్విస్ దిగ్గజం […]

అంతర్జాతీయ క్రికెట్‌లో రారాజులుగా ఏలుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌లపై మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. వీరిద్దరూ కూడా క్రికెట్‌లో రోజర్ ఫెదరర్, రఫెల్ నాడెల్‌లు అని కితాబిచ్చాడు. జింబాబ్వే మాజీ బౌలర్, కామెంటేటర్ పొమినె బాంగ్వాతో ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లో మాట్లాడిన ఏబీ.. విరాట్, స్మిత్‌లలో ఎవరు గొప్ప క్రికెట్ అన్న ప్రశ్నకు పైవిధంగా స్పందించాడు.
సహజసిద్దమైన ఆట ఆడే కోహ్లిని టెన్నిస్‌లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌తో పోల్చాడు. అలాగే రఫెల్ నాడెల్ మాదిరిగా స్టీవ్ స్మిత్ కూడా మానసికంగా చాలా దృడంగా ఉంటాడని ఏబీ కొనియాడాడు. అయితే వీరిద్దరిలో మాత్రం తన ఓటు కోహ్లీకే వేస్తానని స్పష్టం చేశాడు. ఇక లక్ష్యచేధనలో కోహ్లీకి సాటి ఎవ్వరూ లేరన్న ఏబీ.. తనకు, కోహ్లీకి సచిన్ రోల్ మోడల్ అని అన్నాడు. మైదానం వెలుపల, బయట సచిన్ వ్యవహరించే తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ఏబీ అన్నాడు.
Read This: కిమ్ లైఫ్‌స్టైల్ గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే!