ఐసీసీ ఛైర్మన్​ రేసులో మరో మాజీ క్రికెటర్​…

ఐసీసీ ఛైర్మన్ కాలవ్యవధి త్వరలో కంప్లీట్ అవ్వ‌నుంది. ఈ ప‌దవికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఈసీబీ చీఫ్​ కొలిన్ గ్రేవ్ కూడా రేస్ లో ఉన్నాడు. తాజాగా ఈ లిస్టులో మ‌రో పేరు జ‌మైంది. వ

ఐసీసీ ఛైర్మన్​ రేసులో మరో మాజీ క్రికెటర్​...
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 30, 2020 | 12:08 AM

ఐసీసీ ఛైర్మన్ కాలవ్యవధి త్వరలో కంప్లీట్ అవ్వ‌నుంది. ఈ ప‌దవికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఈసీబీ చీఫ్​ కొలిన్ గ్రేవ్ కూడా రేస్ లో ఉన్నాడు. తాజాగా ఈ లిస్టులో మ‌రో పేరు జ‌మైంది. వెస్టిండీస్​ క్రికెట్​ బోర్డు మాజీ ప్రెసిడెంట్ డేవ్​ కేమరూన్​​.. ఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయ‌నే స్వయంగా తెలిపారు. తాను ఎన్నికైతే ప్ర‌పంచ‌ క్రికెట్​లో కొత్త మార్పులు తీసుకొస్తానని వెల్ల‌డించారు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్​ ప్రాచుర్యం పొందే దిశగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. త‌క్కువ ఈవెంట్లు నిర్వహించి ఎక్కువ మొత్తంలో ఆర్జించేలా ప్లానింగ్స్ రెడీ చేస్తాన‌ని ధీమాగా చెబుతున్నారు.

గత నాలుగేళ్లుగా ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్న శశాంక్‌ మనోహర్‌ పదవీకాలం జులైతో కంప్లీట్ అవ్వ‌నుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో నూత‌న అధ్య‌క్షుడు ఎంపిక ప్రక్రియపై క్లారిటీ రానుంది.