FIFA World Cup 2022: ఫీఫా ప్రపంచకప్‌లో ఈ రోజు నాలుగు మ్యాచ్‌లు..ఎప్పుడు, ఎలా చూడాలంటే..?

ఖతర్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ 2022 లో ప్రతిరోజూ మాదిరిగానే, ఈ రోజు(గురువారం0 కూడా 8 జట్లు, నాలుగు మ్యాచ్‌లలో తలపడనున్నాయి. ఈ ఎనిమిది జట్లలో కొన్ని జట్ల పాయింట్ల పట్టికలో ముందుకు కదులుతుండగా, మరికొన్ని గ్రూప్..

FIFA World Cup 2022: ఫీఫా ప్రపంచకప్‌లో ఈ రోజు నాలుగు మ్యాచ్‌లు..ఎప్పుడు, ఎలా చూడాలంటే..?
Fifa World Cup 2022
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 01, 2022 | 12:29 PM

ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2022 లో ప్రతిరోజూ మాదిరిగానే, ఈ రోజు(గురువారం0 కూడా 8 జట్లు, నాలుగు మ్యాచ్‌లలో తలపడనున్నాయి. ఈ ఎనిమిది జట్లలో కొన్ని జట్ల పాయింట్ల పట్టికలో ముందుకు కదులుతుండగా, మరికొన్ని గ్రూప్ దశలోనే ఆగిపోనున్నాయి. గ్రూప్‌-ఈ, గ్రూప్‌-ఎఫ్‌ జట్ల మధ్య జరగబోయే నేటి మ్యాచ్‌లలో హోరాహోరీ పోరు జరగనుంది. అసలు మ్యాచ్‌లు ఏయే జట్ల మధ్య జరుగుతాయో తెలుసుకుందాం..

ఈ రోజు ఎవరెవరి మధ్య మ్యాచ్‌లు..? 

ఫిఫా ప్రపంచకప్ 2022 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా గతే ప్రపంచకప్ టోర్నమెంట్‌ ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా జట్టు బెల్జీయంతో నేటి మొదటి మ్యాచ్ ఆడనుంది. రెండో మ్యాచ్ కెనడా, మొరాకో మధ్య జరగనుంది. ఈ రోజు జరిగే మూడో మ్యాచ్‌లో జపాన్, స్పెయిన్ జట్లు తలపడనుండగా, నాలుగో మ్యాచ్ కోస్టారికా, జర్మనీ మధ్య జరగనుంది.

ఇవి కూడా చదవండి

నాలుగు మ్యాచ్‌లు ఏయే సమయాలలో..?

తొలి రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం ఈ రోజే (డిసెంబర్ 1న) జరుగుతుండగా మిగిలిన రెండు  రేపు జరుగుతాయి. ఈ రోజు రాత్రి  8 గంటల 30 నిమిషాలకు క్రొయేషియా, బెల్జీయం మధ్య జరిగే మొదటి మ్యాచ్, కెనడా మొరాకో జట్లు తలపడబోయే రెండో మ్యాచ్ ప్రారంభమవుతాయి.  ఇక మిగిలిన రెండు మ్యాచ్‌లు జపాన్, స్పెయిన్ టీమ్‌ల మధ్య.. కోస్టారికా, జర్మనీ జట్ల మధ్య ఈ రోజు అర్థరాత్రి తర్వాత అంటే.. డిసెంబర్ 2న ఉదయం 12 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది

ప్రత్యక్ష ప్రసారం ఎలా చూడాలి..?

ఈ రోజు జరిగే నాలుగు మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం స్పోర్ట్స్18, స్పోర్ట్స్18 హెచ్‌డీలో చూడవచ్చు. ఇంకా జియో సినిమా యాప్‌లో ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ చేయబడుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..