Brazil Football legend Pele: మరోసారి హాస్పిటల్‌లో చేరిన బ్రెజిల్ ఫుట్‌బాల్ లెజెండ్.. రెగ్యులర్ చెకప్ మాత్రమేనన్న ఆయన కూతురు..
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజ ప్లేయర్ పీలే మరోసారి ఆస్పత్రిలో చేరారు. 82 ఏళ్ల పీలే చాలా కాలంగా పెద్దపేగు క్యాన్సర్ సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే..
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజ ప్లేయర్ పీలే మరోసారి ఆస్పత్రిలో చేరారు. 82 ఏళ్ల పీలే చాలా కాలంగా పెద్దపేగు క్యాన్సర్ సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే బుధవారం సావో పాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. క్యాన్సర్‌తో పాటు గుండె సంబంధిత సమస్యలతో కూడా పీలే బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సమయంలో పీలే భార్య మార్సియా అయోకీ ఇంకా మరో వ్యక్తి కూడా వారితో ఉన్నారని అనేక వార్తాకథనాలు వెలువడ్డాయి.
పీలే శరీరం మొత్తం వాపులు, ఇతర సమస్యలతో బాధపడడంతో ఆయన్ను తిరిగి ఆసుపత్రిలో చేర్పించినట్లు మార్సియా అయోకీ తెలిపారు. అయితే క్యాన్సర్‌తో బాధపడుతున్న పీలే.. ఇటీవల తన చికిత్సలో భాగంగా అప్పుడప్పుడు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబర్‌లో పీలే పెద్దప్రేగు క్యాన్సర్‌కు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలో కొన్ని రోజులు ఐసీయూలో కూడా ఉండాల్సి వచ్చింది. శస్త్రచికిత్స తర్వాత పీలేకి కీమోథెరపీ జరుగుతోంది.
పీలే క్యాన్సర్‌తో పాటు గుండె సంబంధిత సమస్యలతో కూడా బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పీలే కుమార్తె కెల్లీ నాసిమెంటో తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. పీలే ఆరోగ్య పరిస్థితి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణ చికిత్స కోసం ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్లు ఆమె తెలిపింది. రానున్న కొత్త సంవత్సరంలో తన తండ్రితో కలిసి ఉంటానని, అప్పుడు చాలా ఫొటోలను పంచుకోవచ్చని కెల్లీ చెప్పింది.