టీమిండియా ప్లేయర్‌తో గొడవ.. కట్ చేస్తే.. 8 సిక్సర్లు, 5 ఫోర్లతో ఊచకోత.. ఈ పాక్ ప్లేయర్ ఎవరంటే!
అబుదాబీ వేదికగా జరుగుతోన్న టీ10 లీగ్‌లో పలువురు ఇంటర్నేషనల్ క్రికెటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ టోర్నమెంట్‌లో..
అబుదాబీ వేదికగా జరుగుతోన్న టీ10 లీగ్‌లో పలువురు ఇంటర్నేషనల్ క్రికెటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ టోర్నమెంట్‌లోని 19వ మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్, ఢిల్లీ బుల్స్ మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ఇందులో భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. వాళ్లెవరో కాదు హర్భజన్ సింగ్, పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఇఫ్తికార్ అహ్మద్. ఢిల్లీ బుల్స్ తరపున హర్భజన్ సింగ్ ఆడుతుండగా, ఇఫ్తికార్ బంగ్లా టైగర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చలాయించాలని చూడగా.. చివరికి ఇఫ్తికార్ మెరుపు ఇన్నింగ్స్‌తో తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
ఇఫ్తికర్ అహ్మద్ కేవలం 30 బంతుల్లో 276 స్ట్రైక్‌రేట్‌తో 8 సిక్సర్లు, 5 ఫోర్లతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి తుఫాను బ్యాటింగ్‌కు బంగ్లా టైగర్స్ నిర్ణీత ఓవర్లలో 133 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఢిల్లీ బుల్స్ జట్టు 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ జట్టులో టిమ్ డేవిడ్ 20 బంతుల్లో 6 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో హర్భజన్-ఇఫ్తికర్‌ల పోరు రసవత్తరంగా సాగిందని చెప్పాలి. 5వ ఓవర్లో హర్భజన్ ఇఫ్తికార్‌కు బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్‌లో వరుసగా రెండు బంతులను ఇఫ్తికార్ సిక్స్, ఫోర్ బాదాడు. దీంతో హర్భజన్ తన 2 ఓవర్లలో ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇదిలా ఉంటే.. ఇఫ్తికర్ అహ్మద్ కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. నాలుగో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన ఈ పాక్ ప్లేయర్ తన మొదటి బంతికే సిక్స్ బాదాడు. ఆ తర్వాత, రిచర్డ్ గ్లీసన్ వేసిన ఓవర్‌లో 3 సిక్సర్లు, 2 ఫోర్లు.. హర్భజన్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టాడు. మొత్తంగా 30 బంతుల్లో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఇఫ్తికర్.. కేవలం 13 బంతుల్లో బౌండరీల రూపంలో 68 పరుగులు రాబట్టాడు. కాగా, ఆసియా కప్, T20 ప్రపంచకప్‌లో ఇఫ్తికార్ అహ్మద్ పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. టీ20 ప్రపంచకప్‌లో కేవలం 22.80 సగటుతో 114 పరుగులు చేయగలిగాడు. అయితేనేం ఈ పాక్ ప్లేయర్ టీ10 లీగ్‌లో తన సత్తా చాటుతున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం..