ICC: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఓడినా మెరుగుపడిన భారత ఆటగాళ్ల ర్యాంకింగ్స్.. ఎవరెవరు ఏ స్థానంలో అంటే..

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 0-1తో భారత్ ఓడిపోయినప్పటికి.. భారత ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, శుభమన్ గిల్‌ ర్యాంకులు కొంత మేర మెరుగుపడ్డాయి. కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సత్తా చాటిన భారత బ్యాటర్లు శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్..

ICC: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఓడినా మెరుగుపడిన భారత ఆటగాళ్ల ర్యాంకింగ్స్.. ఎవరెవరు ఏ స్థానంలో అంటే..
Shreyas Iyer
Follow us

| Edited By: Ganesh Mudavath

Updated on: Dec 01, 2022 | 7:15 AM

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 0-1తో భారత్ ఓడిపోయినప్పటికి.. భారత ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, శుభమన్ గిల్‌ ర్యాంకులు కొంత మేర మెరుగుపడ్డాయి. కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సత్తా చాటిన భారత బ్యాటర్లు శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్‌లు తమ అద్భుతమైన ప్రదర్శనకు రివార్డ్ అందుకున్నారు. వన్డే సిరీస్‌లో అర్ధ శతకాలు సాధించిన అయ్యర్ ఆరు స్థానాలు ఎగబాకి 27వ స్థానంలో నిలవగా.. శుభమన్ గిల్ మూడు స్థానాలు ఎగబాకి 34 స్థానానికి చేరుకున్నారు. తొలి మ్యాచ్‌లో శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ రెండు స్థానాలు కిందకి దిగిపోయాడు. కివీస్‌తో వన్డేసిరీస్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఒక్కో స్థానం దిగజారి వరుసగా 8వ, 9వ ర్యాంక్‌లలో నిలిచారు. ఈ వన్డే సిరీస్‌లో 129 పరుగులు సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌.. 27వ ర్యాంక్‌లోకి దూసుకురాగా.. 108 పరుగులు చేసి 3 స్థానాలు ఎగబాకిన శుభ్‌మన్‌ గిల్‌ 34వ ర్యాంక్‌లో నిలిచాడు. న్యూజిలాండ్‌ బ్యాటర్లు టామ్‌ లాథమ్‌, కేన్‌ విలియమ్సన్‌ సైతంతమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. తొలి వన్డేలో ఆ జట్టు 300 పరుగుల లక్ష్యాన్ని అధిగమించడంలో లాథమ్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 104 బంతుల్లో 145 పరుగులతో లాథమ్ 18వ ర్యాంక్‌కి చేరుకున్నాడు.

98 బంతుల్లో 94 పరుగులతో అజేయంగా నిలిచిన కెప్టెన్ విలియమ్సన్ టాప్ 10లో నిలిచాడు. బౌలర్‌ లాకీ ఫెర్గూసన్ 3 59 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకోవడంతో మూడు స్థానాలు ఎగబాకి 32వ స్థానానికి చేరుకున్నాడు. మాట్ హెన్రీ తన పొదుపైన బౌలింగ్‌ కారణంగా నాలుగు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..